కాంగ్రెస్‌పై ప్రశాంత్ కిషోర్‌కు అంత కసి ఎందుకు !?

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఎన్నికలకు వెళితేనే బీజేపీని ఎదుర్కోగలరు..లేకపోతే బీజేపీదే మళ్లీ అధికారం అని.. బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు ఆయన ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. మాట కూడా మార్చారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు నేతృత్వం వహించేందుకు కాంగ్రెస్‌కు హక్కు లేదని..ఆ పార్టీ వరుసగా ఓడిపోతోందని ఆయన చెబుతున్నారు.

ఆయన ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌నే అసలైన కాంగ్రెస్‌గా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు మాత్రమే సాధ్యమైన విచ్చిన్నకర రాజకీయాలతో తృణమూల్ చాలా బలంగా ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను నమ్మిన మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ప్రశాంత్ కిషోర్ గేమ్ అని ఆమె గుర్తించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయంగా వెలిగిపోవాలనుకున్నారు. కానీ అక్కడ ఆయనకు రెడ్ కార్పెట్ లభించలేదు.

దీంతో తనకు కావాల్సిన స్థానం మమతా బెనర్జీ ఇస్తుందని ఆ పార్టీకే ఫుల్ టైం పని చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీని ఓడించలేమన్న వాదనను మర్చిపోయి.. కాంగ్రెస్‌తో పని లేదన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. అంతే కాదు కాంగ్రెస్ మీద మాటల దాడి చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరూ అనరు. ఆ పార్టీలో నాయకత్వం గొప్పగా పని చేయడం లేదని.. బీజేపీ నేతలు.. ఆ పార్టీ సానుభూతిపరులు విశ్లేషిస్తారు. అది పొలిటికల్ స్ట్రాటజీ.

ప్రత్యర్థి పార్టీలో ఎవరు బలంగా ఉంటే వారిని దెబ్బకొడితే ఆటోమేటిక్‌గా పార్టీ బలహీనమవుతుంది. అదే బీజేపీ వ్యూహాన్ని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను వాడుకుని కాంగ్రెస్‌పై ప్రయోగించి బీజేపీకి మేలు చేస్తున్నారు. ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలన్నీ అంతే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ కానిస్టేబుల్ హత్య ఏపీ పోలీసు వ్యవస్థ బలహీనతకు సాక్ష్యం !

నంద్యాలలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను రౌడిషీటర్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. విధి నిర్వహణలో కటువుగా ఉండే హెడ్ కానిస్టేబుల్ రోడ్‌పై ఒంటరిగా కనిపిస్తే ఆరుగురు...

ఫ‌స్టాఫ్ లాక్ చేసిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3తో.. త‌న విజ‌య యాత్ర‌ని దిగ్విజ‌యంగా కొన‌సాగించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా బాల‌కృష్ణ సినిమాపైనే ఉంది. అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం...

కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు....

మీడియా వాచ్ : కులాల మధ్య చిచ్చుపెట్టి చానళ్లు ఎంత సంపాదించుకుంటాయి ?

రాజకీయ మీడియా వలువలు వదిలేసింది. విలువ కట్టుకుని.. వసూలు చేసుకుని నగ్నంగా ఊరేగుతోంది. కులాల పేర్లు పెట్టి ఆ రెండు కులాలు కొట్లాడుకుంటున్నాయని ప్రచారం చేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close