కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతామన్న వైసీపీ ఎమ్మెల్యే

నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైసీపీ నేతలు బతిమాలుతున్నారు. వల్లభనేని వంశీ మీడియా చానళ్లను పిలిచి ప్రతి ఒక్క చానల్‌కు విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశాన్ని టీడీపీ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అనాల్సినదంతా అని క్షమాపణ చెబితే సరిపోతుందా అని ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అడుగడుగునా గౌవరసభలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున తప్పు చేశామని తెర ముంందుకు వస్తున్నారు.

తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరరెడ్డి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆమె భావించి బాదపడి ఉంటే.. కన్నీటితో కాళ్లు కడుగుతామని ప్రకటించి కలకలం రేపారు. వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆ పని చేస్తారన్నారు. వల్లభనేని వంశీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ సహచర సభ్యునిగా బాధ్యత తీసుకుంటామని .. దయచేసి ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరుతున్నారు.

వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమని రాచమల్లు చెప్పుకొచ్చారు. ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పేనంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే..ఈనాడు చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారుకీడుస్తున్నాడని రాచమల్లు అంటున్నారు. టీడీపీ గౌరవసభలు నిర్వహిస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా ఇబ్బందికరంగా ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లైగ‌ర్‌’లో అదిరిపోయే ఐటెమ్ సాంగ్‌.. మ‌రి ఎవ‌రితో?

పెద్ద సినిమా అంటే ఐటెమ్ గీతం మ‌స్ట్ అయిపోయింది. `పుష్ప‌` లో స‌మంత ఐటెమ్ గీతం ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలిసిందే. సినిమాల‌కు అది అద‌నపు ఆక‌ర్ష‌ణ అయిపోతోంది. `లైగ‌ర్‌` కోసం కూడా...

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close