బీహార్‌లో రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ పాదయాత్ర ను యాజ్ లెస్‌గా జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తేల్చారు. ఇప్పుడు బీహార్‌కు కావాల్సింది ఒక ఒక్క యాత్ర అని.. అది నిరుద్యోగ నిర్మూలన యాత్ర అన్నారు. ఇతర యూజ్ లెస్ పాదయాత్రలతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని తేల్చి చెప్పారు. స్ట్రాటజిస్టు నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్.. జనసురాజ్ పార్టీని జనంలోకి తీసుకెళ్తారు. పాదయాత్రను సుదీర్ఘంగా చేసి.. మధ్యలో ఆపేసినా.. తర్వాత వివిధ కార్యక్రమాలతో చురుకుగా ప్రజల్లో ఉంటున్నారు.
గత ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులు పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆయన పార్టీ ప్రభావవంతంగా ఓట్లు చీల్చడంతో.. మంచి ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏ పార్టీలతోనూ ఆయన పొత్తులు పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ లో చేరి కీలక పాత్ర పోషించాలనుకున్నారు. దఫాదఫాలుగా చర్చలు జరిపారు కానీ ఆయనకు.. కీలక పాత్ర ఇవ్వడానికి.. కాంగ్రెస్ లో పాతుకుపోయిన సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కూడా స్ట్రాటజిస్టుల అవసరం లేదనుకున్నారు. ఆయనకు బదులుగా సునీల్ కనుగోలును నమ్ముకున్నారు.
ఆ తర్వాతే ప్రశాంత్ కిషోర్ తన పార్టీ పెట్టుకున్నారు. ఓట్ల జాబితాలు, ఈవీఎంలపై పీకేకు ఎలాంటి అనుమానాలు లేవు. ఓట్ల చోరీ అనేది అభూత కల్పనఅని ఆయన అనుకుంటారు. ఐ ప్యాక్ లో ఉన్నప్పుడు ఆయన టీం.. చాలా వరకూ ఓట్ల జాబితాలను వడ పోస్తూ ఉంటుంది. ఆయా పార్టీల యంత్రాంగాలకు ప్రత్యేకకసరత్తు కూడా చేయిస్తూంటారు. ఓట్లను తీసివేయించేందుకు ఫామ్ 7లను అప్లయ్ చేయించడం ఐ ప్యాక్ వ్యూహాల్లో ఒకటి. అయినా ప్రశాంత్ కిషోర్.. రాహుల్ యాత్రను యాజ్ లెస్‌గా తేల్చేశారు.