కొండారెడ్డి బురుజు.. క‌రోనా క‌ల‌క‌లం

క‌రోనా వ‌ల్ల చిత్ర‌సీమ‌కు ఏదైనా మంచి జ‌రిగిందంటే.. అది ఓ కొత్త జొన‌ర్ పుట్టుకురావ‌డ‌మే. క‌రోనా త‌ర‌వాత‌.. ఈ ఉప‌ద్ర‌వం నేప‌థ్యంలో కొన్ని క‌థ‌లు వ‌స్తాయ‌ని చిత్ర‌సీమ ముందే ఊహించింది. అయితే దానికి కాస్త టైమ్‌ప‌డుతుందేమో అనుకుంటే, మ‌న వాళ్లు ఆగేట్టు లేరు. వ‌రుస‌గా అలాంటి కథ‌లు సిద్ధం చేసేస్తున్నారు. రాంగోపాల్ వ‌ర్మ క‌రోనా నేప‌థ్యంలో ఓ సినిమా తీశాన‌ని ప్ర‌క‌టించాడు. టీజ‌ర్ కూడా విడుద‌ల చేశాడు. ఇప్పుడు ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా క‌రోనా నేప‌థ్యంలో ఓ సినిమా మొద‌లెట్టాడు. ఈ రోజు… మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశాడు. మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే క‌ర్నూలు కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్‌లో ఈ క‌థ చెబుతున్న‌ట్టు అనిపిస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఆలోచ‌న‌లు విభిన్నంగా ఉంటాయి. అ, క‌ల్కి చిత్రాలలో త‌న మార్క్ క‌నిపించింది. కరోనా నేపథ్యంలో తెర‌కెక్కుతున్న తొలి సినిమా కాబ‌ట్టి, ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ 40 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే టైటిల్ ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి... బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే...

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

HOT NEWS

[X] Close
[X] Close