ప్రవీణ్ ప్రకాష్ : బాస్‌ చెప్పింది చేసే సూపర్ ఆఫీసర్..!

ఎందుకు ..? ఏమిటి..? ఎలా ..? అని అడగకుండా.. చెప్పింది చెప్పినట్లు ..చేసుకు వచ్చే ఉద్యోగి అంటే.. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు…?. మిగతా వారందరికీ ఇష్టం ఉండకపోవచ్చు కానీ.. ఆ పనులు చెప్పే బాస్‌కు మాత్రం ఖచ్చితంగా ఇష్టుడైపోతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తిరుగులేని అధికారిగా … పవర్‌ఫుల్‌గా ఎదిగిన ప్రవీణ్ ప్రకాష్.. ఈ కోవలోని అధికారే. ముఖ్యమంత్రి జగన్ మనసెరిగి.. ఆయన ఆలోచనల్ని పక్కాగా అమల్లో పెట్టడానికి ప్రవీణ్ ప్రకాష్… క్షణం ఆలస్యం చేయడం లేదు. ప్రోస్ అండ్ కాన్స్ పేరుతో లెక్కలేసి.. ముఖ్యమంత్రికి సాధ్యాసాధ్యాల గురించి వివరించడం లేదు. జగన్ అనుకున్నారు అంటే.. చేయాల్సిందే అన్నట్లుగా ముందుకెళ్లిపోతున్నారు. ఈ పద్దతే.. ముఖ్యమంత్రికి నచ్చింది. తనదైన శైలిలో పాలన చేయడానికి ప్రవీణ్ ప్రకాష్ పిల్లర్‌గా ఉండాల్సిందేనని జగన్ నిర్ణయించుకునేలా చేసింది.

ప్రవీణ్ ప్రవీణ్ .. జగన్ మనసెరిగి నడుచుకునే అధికారి..!

ప్రవీణ్ ప్రకాష్‌కి అధికారవర్గాల్లో ఓ రకమైన నెగెటివ్ ఇమేజ్ ఉంది. ఆయనకు షార్ట్ టెంపరని.. ఊరకనే విసిగిస్తూ ఉంటారని.. ఎదురు చెప్పకుండా… ఆయన చెప్పిన పని చేయాల్సిందేనని లేకపోతే.. దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. ఓ రకంగా ఇవన్నీ నిజమే కావొచ్చు.. కానీ ప్రవీణ్ ప్రకాష్.., ఏదీ వ్యక్తిగతంగా చేయరు.. కేవలం విధి నిర్వహణ కోసమే…. అలా చేస్తారు. అంటే పని రాక్షసుడు అని అనుకోవచ్చేమో…?. ఆయన వ్యవహారశైలి మిగిలిన అధికారులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఎవర్నీ నెత్తి మీద పెట్టుకోరు. పని తీరు ఆధారంగానే ఎవర్నైనా దగ్గరకు రానిస్తారు. అచ్చంగా తన విషయంలోనూ అంతే ఉంటారు. తన పనితీరే ప్రాతిపదిక అనుకుంటారు. తాను బాస్‌గా కింది స్థాయి వర్గాల నుంచి ఎలాంటి పనితీరు ఆశిస్తారో.. తన బాస్ వద్ద.. తాను అదే సిన్సియార్టీని ప్రదర్శిస్తారు. ఎందుకు.. ఏమిటి.. ఎలా అనే ప్రశ్నలు రానివ్వకుండా… బాస్ చెప్పింది చేయడానికి తూ.చ తప్పకుండా ప్రయత్నిస్తారు.

ప్రవీణ్ ప్రకాష్‌కు చట్టం.. న్యాయం… రాజ్యాంగం అన్నీ జగనే..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాను అనుకున్నది జరగాలనుకునే మనస్తత్వం. బాస్ చెబితే చేసి తీరాలన్నది ప్రవీణ్ ప్రకాష్ తత్వం. అదే ఇద్దరి వేవ్ లెంగ్త్‌ను కలిపింది. ఇతర సీనియర్ అధికారులు అలా కాదు.. ఏదో ఓ సందర్భంలో.. సూచనలు.. సలహాలు ఇవ్వాలనుకున్నారు. రాజధాని తరలింపు అంశం .. అంతర్గత చర్చల్లో ఉన్నప్పుడు.. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. దాని వల్ల వచ్చే సాధకబాధలను ఏకరవు పెట్టినట్లు… వ్యతిరేకించినట్లుగా ప్రచారం ఉంది. అయితే .. అప్పటికీ సీఎంవోలో కీలక స్థానంలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్..ముఖ్యమంత్రి నిర్ణయం సాధ్యమేనని తేల్చినట్లుగా తెలుస్తోంది. ఆ పరిణామమే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఊస్టింగ్ అంటారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అయిన ఇళ్ల పట్టాల పంపిణీ .. రాజధానిలో భూములను ఇతర ప్రాంతాల వారికి పంపిణీ చేయడం సహా.. ఎన్నో అంశాలను.. జగన్ చెప్పినట్లు చేయడానికి ప్రవీణ్ వెనుకాడలేదు. కోర్టు తీర్పులు.. హెచ్చరికలను ఆయన పట్టించుకోలేదు. బాస్.. జగన్ చెప్పింది చేయడం మాత్రమే.. తన విధి అని ఆయన అనుకున్నారు. అనుకున్నట్లుగా చేస్తూ వస్తున్నారు. అందుకే ఆయన వీర విధేయునిగా నిలిచారు. అత్యంత నమ్మకస్తునిగా నిలిచారు.

ముందు నుంచీ ప్రవీణ్ ప్రకాష్‌ది అదే సిన్సియారిటీ..!
ప్రవీణ్ ప్రకాష్.. ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి సన్నిహిత అధికారుల జాబితాలో లేరు. జగన్ అధికారంలోకి గత ఏడాది జూన్‌లో వచ్చారు. ఆ సమయంలో.. ఆయన ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. సెప్టెంబర్‌లో సీఎంవోలోకి ప్రవీణ్ ప్రకాష్ వచ్చారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా.. ఒకే రకమైన పనితీరును కనబర్చడం ప్రవీణ్ ప్రకాష్ స్టైల్. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు…ప్రవీణ్ పనితీరు నచ్చి బాగా ప్రోత్సహించారు. చంద్రబాబు ఇష్టపడే అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ ఉండేవారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా… ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. తన పనితీరుతో.. అప్పట్లో కొత్తగా కార్పొరేషన్ అయిన గుంటూరుకు ఓ రూపు తీసుకు వచ్చారు. ఆ తర్వాత విశాఖ కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా.. అంతే సీరియస్‌గా పని చేస్తున్నారు. ఫలితంగా.. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడయిన ఆఫీసర్‌గా ఎదిగారు.

ప్రవీణ్ ప్రకాష్.. ఎదుగుదల చాలా మందికి… నచ్చకపోవచ్చు. వారు లోపాలు వెతకొచ్చు. కానీ చట్టం..న్యాయం… రాజ్యాంగం .. ఇవన్నీ అమలు చేయాల్సింది ప్రభుత్వమే. అంటే ప్రభుత్వాధినేతే సుప్రీం. అలాంటి సమయంలో ఆ ప్రభుత్వాధినేత ఎం చెబితే అది చేయాలి. దాన్ని గుర్తించారు కాబట్టే ప్రవీణ్ ప్రకాష్.. ఇప్పుడు.. ఏపీ సర్కార్‌ను.. జగన్ తరపున ఒంటి చేత్తో నడిపే అవకాశాన్ని పొందారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close