రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యేల కేసులు..!

రఘురామకృష్ణంరాజు తమను పందులతో పోల్చారంటూ.. వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ముందుగా మంత్రి శ్రీరంగనాథరాజు .. తన పీఏతో.. పోడూరు అనే మండల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఎంపీ అసభ్యంగా మాట్లాడారని చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. పోలీసులు మాత్రం… కోర్టులో తేల్చుకోవాలని చెప్పి పంపారని ప్రచారం జరిగింది. తాజాగా.. బీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇలా.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జాబితాలో చేరారు. రఘురామకృష్ణంరాజు వైసీపీలో వర్గ విబేధాలు రెచ్చగొట్టేలా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ… ఫిర్యాదు చేశారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వరుస పెట్టి పోలీస్ స్టేషన్‌లకు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు పంపుతూండటంతో.. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

రఘురామకృ‌ష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యేలు మొదట్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ మార్క్ భాషతో పాటు.. దిష్టిబొమ్మలు దహనం చేయించారు. ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు అదే పనిగా పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఆ కారణంగానే ఆయన… తనకు కేంద్ర భద్రత కావాలంటూ… స్పీకర్‌కు లేఖ రాశారు. దానిపై నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఈ తరుణలో రఘురామకృష్ణంరాజుపై రివర్స్ కేసుల అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది. పోలీసులు కేసులు నమోదు చేస్తారా లేదా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ నేతలు వాడే భాషతో పోలిస్తే.. రఘురామకృష్ణంరాజు భాష చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఇలాంటి భాషను కూడా వాడవచ్చా.. అని ఆశ్చర్యపోయేలా.. బూతులతో విరుచుకుపడటం వైసీపీ నేతల స్టైల్. అలాంటిది.. తమను అసభ్యంగా తిట్టారంటూ… ఎంపీపైన కేసులు నమోదు చేయాలని అదే పనిగా ఫిర్యాదులు చేయడం… అందర్నీ ఆశ్చర్య పరిచేదే. దీనిపై రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారో కానీ… నర్సాపురం వైసీపీ రాజకీయ పంచాయతీ మాత్రం.. రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close