ఆసుప‌త్రి పాలైన సీరియ‌ర్ న‌టి.. ప్ర‌స్తుతం క్షేమం

సీనియర్‌ నటి జయంతి అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. కొంతకాలంగా ఆమె శ్వాస‌కు సంబంధించిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. బుధ‌వార ఆమె ఆరోగ్యం క్షీణించ‌డంతో బెంగ‌ళూరులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వెంటిలేట‌ర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు, నెగిటీవ్ గా రిపోర్టు వ‌చ్చిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. జ‌యంతి ఆరోగ్యం క్ర‌మక్ర‌మంగా మెరుగుప‌డుతోంద‌ని, ఆమె క్షేమంగానే ఉన్నార‌ని వైద్యులు ధృవీక‌రించారు.

కొంత‌కాలం క్రితం కూడా జ‌యంతి తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. ఆసుప‌త్రిలో చికిత్స త‌ర‌వాత ఆమె కోలుకున్నారు. తెలుగు,తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ… ఇలా ప‌లు భాష‌ల్లో 500ల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు జ‌యంతి. సెంటిమెంట్ పాత్ర‌ల‌కు ఆమె పెట్టింది పేరు. రాజ్ కుమార్‌కి ప్రియ‌మైన హీరోయిన్ ఆమె. ఇద్ద‌రూ క‌లిసి దాదాపు 30 చిత్రాల్లో జోడీ క‌ట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

భార‌తీరాజా సీక్వెల్‌లో.. కీర్తి సురేష్‌?

భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎర్ర‌గులాబీలు` సూప‌ర్ హిట్ అయ్యింది. ఇళ‌య‌రాజా సంగీతం, శ్రీ‌దేవి గ్లామ‌ర్‌, క‌మ‌ల్ న‌ట‌న‌.. ఇవ‌న్నీ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 40...

HOT NEWS

[X] Close
[X] Close