వ‌ర్మ… టీ ‘గ్లాసు’లో తుపాను

ఈ ప్ర‌పంచాన్ని ప‌ట్టుకుని క‌రోనా ఎలా వ‌ద‌ల‌డం లేదో, కాంట్ర‌వ‌ర్సీని ప‌ట్టుకుని రాంగోపాల్ వ‌ర్మ అలా వ‌ద‌ల‌డం లేదు. వివాదం – వ‌ర్మ రెండూ జంట ప‌దాల్లా త‌యార‌య్యాయి. వ‌ర్మ‌లోకి క్రియేటివిటీ దీనికే ప‌రిమితం అవ్వ‌డం బాధాక‌ర‌క‌మే అయినా, కొత్త కొత్త వివాదాలు వెదుక్కుని మ‌రీ వాటిపై సినిమాలు తీయ‌డం చిత్ర‌సీమ‌లో ఆస‌క్తిని రేపే అంశంగా త‌యారైంది.

వ‌ప‌న్ క‌ల్యాణ్‌తో వ‌ర్మ చాలాసార్లు పెట్టుకున్నాడు. త‌న అభిమానుల‌తో ఆడుకున్నాడు. వాళ్ల ఆగ్ర‌హ జ్వాల‌కు బ‌ల‌య్యాడు. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్‌పై సినిమానే తీస్తున్నాడు. టైటిల్ `ప‌వ‌ర్ స్టార్‌`. ఈ సినిమా ఈమ‌ధ్యే ప్ర‌క‌టించాడు. ఇప్పుడు ఫ‌స్ట్ లుక్ వ‌దులుతున్నాడు. రేపు ఉద‌యం 11గంట‌ల 37 నిమిషాల‌కు ప‌వ‌ర్ స్టార్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తాడ‌ట‌. ఇప్పుడు ప్రీ లుక్ బ‌య‌ట పెట్టాడు. వ‌వ‌ర్ స్టార్ టైటిల్ మ‌ధ్య‌లో టీ గ్లాసు పెట్టి – ప‌వ‌న్ అభిమానుల్ని మ‌రింత రెచ్చ గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. టీ గ్లాసు – టైటిల్ చూస్తే ఈ సినిమా ఎవ‌రిపైనో ఈజీగా అర్థం అవుతుంది. కానీ వ‌ర్మ మాత్రం.. ఇది కేవ‌లం ఫిక్ష‌న్ మాత్ర‌మే, స‌న్నివేశాలు, టైటిల్ ఎవ‌రి జీవితాన్న‌యినా పోలి ఉంటే అది కేవ‌లం యాదృచ్చిక‌మే అంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రేపు పోస్ట‌ర్ లో ఇంకెన్ని వింత‌లూ, విడ్డూరాలూ, పోలిక‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి.

ఈ పోస్ట‌రు, లోగో… టీ గ్లాసు ఇవ‌న్నీ ప‌వ‌న్ అభిమానుల్ని కిర్రెక్కించేవే. ఇది చాల‌దూ.. వ‌ర్మ బిజినెస్ ఐడియా.. స‌క్సెస్ అవ్వ‌డానికి. టీ గ్లాసులో తుపాను ఇప్పుడే మొద‌లైంది. అది ఏ తీరాన్ని చేరుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

భార‌తీరాజా సీక్వెల్‌లో.. కీర్తి సురేష్‌?

భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎర్ర‌గులాబీలు` సూప‌ర్ హిట్ అయ్యింది. ఇళ‌య‌రాజా సంగీతం, శ్రీ‌దేవి గ్లామ‌ర్‌, క‌మ‌ల్ న‌ట‌న‌.. ఇవ‌న్నీ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 40...

HOT NEWS

[X] Close
[X] Close