బీజేపీని అదే పనిగా రెచ్చగొడుతున్న విజయసాయిరెడ్డి..!

భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ నేతల్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి సామ, భేద, దాన, దండోపాయాల్ని ప్రయోగించి… లాక్కుంటున్నారు. అదే సమయంలో.. కొంత మంది బీజేపీలో చేరుతూంటే.. వాళ్లు మాత్రం.. బీజేపీని నాశనం చేయడానికి వెళ్తున్నారని.. రోజూ.. ఏదో ఓ రూపంలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో..బీజేపీ నేతలు చిర్రెత్తిపోయింది. విజయసాయిరెడ్డిని ఇలా వదిలేస్తే… తాము చులకన అయిపోతామని అనుకున్నారేమో కానీ… ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్ సహా.. పలువురు నేతలు సోషల్ మీడియాలోనే.. విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు.

అన్ని రంగుల్ని కలుపుకునే బలం బీజేపీకి ఉందని… చెబుతూ.. సునీల్ ధియోధర్ నేరుగా.. విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో నామినేటెడ్ పదవి ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు విజయసాయిరెడ్డిపై ఘాటుగా విరుచుకుపడ్డారు. మరోసారి బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే బాగుండదని హెచ్చరించారు. అయితే.. ఈ విమర్శలన్నింటిపై సైలెంట్‌గా ఉంటున్న విజయసాయిరెడ్డి.. కన్నా లక్ష్మినారాయణను మాత్రం.. అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. తమ పార్టీ అంతర్గత విషయంలో గతంలో కన్నా మాట్లాడారంటూ.. ఎదురుదాడికి దిగారు. ఆయన కూడా.. టీడీపీ వ్యక్తి అన్నట్లుగా చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి చాలా పకడ్బందీగా.. బీజేపీని టార్గెట్ చేసి… బలపడకుండా చేస్తున్నారని.. టీడీపీని బూచిగా చూపి.. పబ్బం గడుపుకుంటున్నారన్న అభిప్రాయానికి బీజేపీ నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి విషయంలో.. బీజేపీ నేతలు ఇక ఏ మాత్రం.. సంయమనం పాటించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి కూడా ఇదే ఎఫెక్ట్ కోరుకున్నారేమో కానీ.. అదే పనిగా… ఆ పార్టీ నేతల్ని రెచ్చగొడుతున్నారు. బీజేపీ నాయకులపై.. వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఇక్కడ రిజర్వేషన్లు పాటిస్తున్నారు. ఏపీ బీజేపీలో ఉన్న రెండు వర్గాల్లో.. వైసీపీకి మద్దతుగా ఉండే వర్గం.. విమర్శలు చేసినా స్పందించడం లేదు. మరో వర్గం చిన్న విమర్శ చేసినా విరుచుకుపడుతున్నారు. సోము వీర్రాజు.. చాలా రోజుల నుంచి ఇళ్ల స్థలాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. దాని గురించి చెప్పని విజయసాయిరెడ్డి.. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ల నిర్మాణంలోనూ అవినీతి జరిగిందని చెప్పారంటూ… సోమువీర్రాజును పొగిడినట్లుగా ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తూంటే.. బీజేపీని విజయసాయిరెడ్డి కావాలనే రెచ్చ గొడుతున్నారేమో అన్న అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close