‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా ‘పిట్ట‌క‌థ‌’. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా భ‌యాల‌తో – జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం మానివేయ‌డం వ‌ల్లో, సినిమాలో స‌రుకు లేక‌పోవ‌డం వ‌ల్లో.. టికెట్లు తెగ‌లేదు. థియేట‌ర్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ ఈ సినిమా.

అయితేనేం.. ఓటీటీ వేదిక‌పై ఇర‌గాడేసింది. థియేట‌ర్ నుంచి తీసేసిన రెండు వారాల‌కే ఈ సినిమా ఆమేజాన్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ సినిమాని మీడియేట‌ర్ 75 ల‌క్ష‌ల‌కు కొనుక్కుని అమేజాన్‌కి పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఇచ్చేశాడు. వ్యూకి ప‌ది రూపాయ‌ల చెప్పున అమేజాన్ లెక్క‌గ‌డితే… ఈ సినిమాకి ఇప్ప‌టి వ‌ర‌కూ 4 కోట్ల వ‌ర‌కూ రెవిన్యూ వ‌చ్చింద‌ని స‌మాచారం. సినిమా బ‌డ్జెట్ 1.25 కోట్ల‌యితే… ఆ లెక్క‌న భారీ లాభాలు వ‌చ్చిన‌ట్టే. కానీ ఇవేం నిర్మాత‌కు రావు. ఆయ‌న ఆల్రెడీ ఈసినిమాని 75 ల‌క్ష‌ల‌కు ఇచ్చేశాడు కాబ‌ట్టి.. అమేజాన్‌లో హిట్ట‌యినా, ఆ లాభాలు అందుకోలేక‌పోయాడు. కానీ మీడియేట‌ర్ తో చేసుకున్న ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం.. ‘ఓ పిట్ట క‌థ‌’ డిజిట‌ల్ రైట్స్ నిర్మాత ద‌గ్గ‌రే ఉన్నాయి. ఆహ‌క్కుల్ని మీడియేట‌ర్ మ‌రో కోటి రూపాయ‌లు ఇచ్చి కొనుక్కున్నాడ‌ట‌. ఆ రూపంలో చూస్తే.. సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత లాభాల‌తో గ‌ట్టెక్కాడు. అస‌లు ఈ సినిమా మేకింగ్ తో సంబంధం లేని మీడియేట‌ర్ నిర్మాత కంటే ఎక్కువ లాభాల్ని ఆర్జించ‌గ‌లిగాడు. అదీ.. పిట్ట క‌థ వెనుకున్న పెద్ద స్టోరీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

“చేయూత” డబ్బులతో వ్యాపారం నేర్పిస్తున్న జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం.. మరో వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఇంటి నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ. 18,750 ఇచ్చే ఈపథకం...

HOT NEWS

[X] Close
[X] Close