ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే జ‌ర‌గాలి. త్వ‌ర‌లోనే ముంబైలో ఓ భారీ షెడ్యూల్‌కి ప్లాన్ చేశాడు పూరి. అయితే ముంబైలో ప‌రిస్థితులు అంత అనుకూలంగా లేవ‌ని ఆ నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్టు స‌మాచారం. ముంబై షెడ్యూల్‌లో తీయాల్సిన స‌న్నివేశాల్ని.. రామోజీ ఫిల్మ్‌సిటీలో లాగించేయాల‌ని ప్లాన్ చేస్తున్నార్ట‌. ఇందుకోసం ఫిల్మ్‌సిటీలో సెట్ వేయాల‌ని పూరి భావిస్తున్న‌ట్టు స‌మాచారం. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా హైద‌రాబాద్ వ‌దిలి, బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌డానికి అంగీక‌రించ‌డం లేద‌ని, క‌రోనా భ‌యాల దృష్టిలో ఉంచుకుని, ముంబై షెడ్యూల్‌ని పూరి పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ని టాక్‌. హిందీ చిత్ర రంగ‌మే.. ఇప్పుడు ముంబైలో షూటింగులు చేసుకోలేక‌, ఫిల్మ్‌సిటీకి ప‌రిమిత‌మైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు విరివిగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్నాయి. ఇలాంటి ద‌శ‌లో ఇక్క‌డి నుంచి ముంబై వెళ్లి షూటింగ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని పూరి ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే సెట్ ప‌ని పూర్తి చేసి, రంగంలోకి దిగాల‌ని పూరి భావిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

భార‌తీరాజా సీక్వెల్‌లో.. కీర్తి సురేష్‌?

భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎర్ర‌గులాబీలు` సూప‌ర్ హిట్ అయ్యింది. ఇళ‌య‌రాజా సంగీతం, శ్రీ‌దేవి గ్లామ‌ర్‌, క‌మ‌ల్ న‌ట‌న‌.. ఇవ‌న్నీ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 40...

HOT NEWS

[X] Close
[X] Close