ఇట్స్ అఫీషియల్..! మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..!

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాత్రి ఎనిమిదిన్నర వరకూ ఎన్సీపీకి గడువు ఇచ్చిన గవర్నర్…అంత వరకూ వేచిచూడలేదు. మధ్యాహ్నమే… గవర్నర్.. తన సిఫార్సును కేంద్ర ప్రభుత్వానికి పంపారు. వెంటనే కేంద్రమంత్రివర్గం.. గవర్నర్ సిఫార్సుకు ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా…వెంటనే ఆ సిఫార్సుకు ఆమోద ముద్ర వేస్తూ.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ – శివసేన కూటమిగా పోటీ చేసి మెజార్టీ సీట్లు సాధించాయి. బీజేపీకి 105, శివసేనకు 56సీట్లు వచ్చాయి. అయితే శివసేన తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది.దానికి బీజేపీ హైకమాండ్ అంగీకరించలేదు.

కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది కానీ…సమయం సరిపోలేదు.. ఇరవై నాలుగు గంటల సమయమే శివసేనకు ఇచ్చిన గవర్నర్….మరికొంత సమయం ఇవ్వడానికి నిరాకరించారు. ఎన్సీపీకి సమయం ఇచ్చి..ఆ సమయం ముగియక ముందే రాష్ట్రపతి పాలన విధించేశారు. గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. కనీసం.. ఎన్సీపీకి ఇచ్చిన గడువు వరకైనా..గవర్నర్ ఎందుకు ఎదురుచూడలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు.. శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గవర్నర్ తమకు మరికొంత సమయం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని శివసేన వాదిస్తోంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపైనా శివసేన మరో పిటిషన్ ను కోర్టులో వేయనుంది.

కోర్టులో పిటిషన్లు… వాదనలు ఇవన్నీ.. సెకండరీ.. ఇప్పటికైతే.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ప్రారంభమయింది. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం.. అదీ కూడా మిత్రపక్షంతో మెజార్టీ సాధించినప్పటికీ.. విఫలమవడం… ఇదే మొదటి సారి. అయినప్పటికీ.. ఇతరులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయడంలో.. మాత్రం విజయం సాధించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

HOT NEWS

[X] Close
[X] Close