కృష్ణ‌వంశీ – ఇళ‌య‌రాజా.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు

కృష్ణ‌వంశీకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆయ‌న సినిమాలు ఫెయిల్ అయినా పాట‌లు బాగుంటాయి. సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా స‌రే, కృష్ణ‌వంశీ మార్క్ క‌నిపిస్తుంది. ఆయ‌న పాట‌ల్ని తెర‌కెక్కించే తీరు కూడా విభిన్నంగా ఉంటుంది. అలాంటి ద‌ర్శ‌కుడికి స్వ‌ర‌జ్ఞాని ఇళ‌య‌రాజా తోడైతే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాలా? ‘అంతఃపురం’ చూస్తే అర్థ‌మైపోతుంది. ఆ సినిమా హిట్టు. పాట‌లు ఇంకా పెద్ద హిట్టు. ‘అస‌లేం గుర్తుకురాదు.. నా క‌న్నుల ముందర నీవుండ‌గా’ పాటైతే ఇప్ప‌టికీ వినిపిస్తుంటుంది. గొప్ప మెలోడీ అది.

ఆ సినిమా వ‌చ్చి చాలా కాలం అయ్యింది. ఆ త‌ర‌వాత ఇళ‌య‌రాజా – కృష్ణ‌వంశీ మ‌ళ్లీ ప‌నిచేయ‌లేదు. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు. ‘రంగ మార్తాండ‌’ కోసం. మ‌రాఠీలో విజ‌య‌వంత‌మైన ‘న‌ట సామ్రాట్‌’ సినిమాకి ఇది రీమేక్‌. ప్ర‌కాష్‌రాజ్ కీల‌క‌పాత్ర‌ధారి. ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొద‌లైపోయాయి. ప్ర‌కాష్‌రాజ్ ఇళ‌య‌రాజాకి పెద్ద ఫ్యాన్‌. ప్ర‌కాష్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల‌కు ఇళ‌య‌రాజానే సంగీతం అందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేష‌న్ ఇలా కుదిరింది. ఈ నెల‌లోనే ‘రంగ‌ మార్తాండ‌’ సెట్స్‌ పైకి వెళ్ల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

HOT NEWS

[X] Close
[X] Close