అల వైకుంఠ‌పురం నుంచి తెలుగు ర్యాప్‌

‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న’ పూర్తి క్లాస్ మెలోడీ. ఆ వెంట‌నే ‘రాములో రాములా’ దింపారు. అది పార్టీ పాట‌. మాంచి నాటు స‌రుకు. బ‌న్నీ డాన్సుల‌కు స్కోప్ ఉన్న పాట‌. ఇప్పుడు ‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’ నుంచి ముచ్చ‌ట‌గా మూడో పాట వ‌స్తోంది. ఈనెల 14న పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేస్తారు. 21న పూర్తి పాట బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఇదో ర్యాప్ సాంగ్‌. `డాడీ డాడీ` అంటూ మొద‌ల‌వుతుంది. మంచి డాన్సు బిట్టు. తెలుగులో ర్యాప్ గీతాలు చాలా త‌క్కువ‌. వేళ్ల‌మీద లెక్క‌పెట్టొచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి ప్ర‌య‌త్నాలేం జ‌ర‌గ‌లేదు. కానీ త్రివిక్ర‌మ్ సినిమా క‌దా, పాట‌లు కూడా కొత్త కోణంలో ఉంటాయి. అందుకే ఈ ప్ర‌య‌త్నం చేశారు. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ తొలి టీజ‌ర్ లో మంచి మ్యూజిక్ బిట్ వినిపించింది. ఆ బిట్టు… ఈ పాట‌లోనిదే. ఒక్కో పాట ఒక్కోలా ఉండేట్టు జాగ్ర‌త్త ప‌డుతున్నాడు త్రివిక్ర‌మ్‌. ఆయ‌న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే మంచి బాణీల్ని స‌మ‌కూరుస్తున్నాడు త‌మ‌న్‌. ఈ సినిమాలోనే శ్రీ‌కాకుళ జాన‌ప‌ద గీతం ఉంద‌ని తెలుగు 360 ముందే చెప్పింది. ఆ పాట‌ని విడుద‌ల చేస్తారా, లేదంటే సినిమా వ‌చ్చే వ‌ర‌కూ దాస్తారా? అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close