ప‌వ‌న్ పై పెరుగుతున్న ఒత్తిడి

టాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు త‌ప్ప‌ని స‌రిగా ముందు వ‌రుస‌లో ఉంటుంది. కాక‌పోతే.. ప‌వ‌న్ ని డ‌బ్బులు జాగ్ర‌త్త పెట్ట‌డం తెలీదు. డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌డ‌మూ తెలీదు. అందుకే… పెద్ద‌గా వెన‌కేసుకోలేక‌పోయాడు. పైగా జ‌న‌సేన పార్టీ కోసం ఉన్న‌దంతా ఖ‌ర్చు పెట్టాడు. లోటు బ‌డ్జెట్ పూడ్చుకోవ‌డానికి ఎప్పుడూ లేనంత‌గా అడ్వాన్సులు తీసుకున్నాడు. ఇప్పుడు వాటి కోస‌మే సినిమాలు చేయ‌డం మొద‌లెట్టాడు.

రామ్ తాళ్లూరి ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఇది వ‌ర‌కే భారీగా అడ్వాన్సు తీసుకున్నాడు. అయితే అప్ప‌ట్లో ప‌వ‌న్ కి సినిమా చేసే ఉద్దేశ్యం లేదు. అప్పుగా తీసుకుని, తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాడు. అయితే.. ఇంత వ‌ర‌కూ అది కుద‌ర్లేదు. దాంతో రామ్ తాళ్లూరితో సినిమా చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప‌వ‌న్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. రామ్ తాళ్లూరితో సినిమా ఎప్పుడ‌న్న‌ది స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే రామ్ నుంచి ప‌వ‌న్ పై ఒత్తిడి ఎక్కువ అవుతోంద‌ని టాక్‌. సినిమా ఇప్పుడు చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు.. క‌నీసం ఎనౌన్స్‌మెంట్ ఇచ్చుకుంటా.. అని చెబుతున్నాడ‌ట రామ్‌. దాంతో ప‌వ‌న్ కి మ‌రో మార్గం లేకుండా పోయింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. ఈ చిత్రానికి డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ఏ.ఎం.ర‌త్నం, మైత్రీ మూవీస్ వీళ్ల ద‌గ్గ‌ర కూడా ప‌వ‌న్ ఇది వ‌ర‌కే అడ్వాన్సులు తీసుకున్నాడు. అందుకే వాటిని తీర్చ‌డానికి సినిమాలు చేయాల్సివ‌స్తోంది. ఏ.ఎం.ర‌త్నం సైతం త‌న సినిమాని వేగంగా పూర్తి చేసి పెట్ట‌మ‌ని ఒత్తిడి చేస్తున్నాడ‌ట‌. అందుకే వ‌కీల్ సాబ్ పూర్త‌యిన వెంట‌నే… యుద్ధ ప్రాతిప‌దిక‌న క్రిష్ సినిమాని ముగించాల‌ని చూస్తున్నాడు ప‌వ‌న్. మ‌రోవైపు క్రిష్ కూడా.. స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప‌వ‌న్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్రేటర్‌”లో ఇప్పుడు పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత రాజకీయం..!

గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కూల్చివేతల వరకూ వచ్చింది. ఒకరు పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌ల గురించి మాట్లాడగా.. మరొకరు దారుస్సలాం కూల్చివేత గురించి మాట్లాడుకోవడంతో రగడ మలుపు తిరిగింది....

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

HOT NEWS

[X] Close
[X] Close