ఏపీ బాట పట్టాలంటూ కెసిఆర్ పై ఒత్తిడులు

చాలా విషయాలలో తెలంగాణ సీఎం కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక విషయంలోచంద్రబాబు నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు అనుసరించవలసి వచ్చేలా ఉంది. తెలంగాణ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ ఇప్పుడు ఊపు అందుకుంటోంది. ఆ మేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు కెసిఆర్ మీద ఒత్తిడి పెరుగుతున్నది.

చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ లో ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయ్యే వారికీ చెల్లింపులు చేయలేక అలా చేసినట్లు అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఉద్యోగ వర్గాలలో మాత్రం సర్వత్రా హర్షమే వ్యక్తం అయ్యింది. అదే సమయంలో తెలంగాణాలో కూడా ఉద్యోగులనుంచి అదే డిమాండ్ వినిపించింది. కానీ సర్కారు అప్పట్లో పట్టించుకోలేదు. జీతాల పెంపు వంటి అనేక నిర్ణయాలలో కెసిఆర్ ముందంజలో ఉన్నారు కానీ ఇదే సంగతిని పక్కన పెట్టారు.

సుమారు రెండేళ్ల తర్వాత ఇప్పుడు అదే అంశం మల్లి తెరమీదకు వస్తోంది. ఈ వయోపరిమితి పెంపు వలన ప్రభుత్వానికి అనేక లాభాలు ఉన్నాయని వివరిస్తూ ఉద్యోగులు నివేదికలు ఇస్తూన్నారు. కేవలం ఏపీ లో మాత్రమే కాకుండా దేశంలో 20 రాష్ట్రాలలో 60 ఏళ్ళ పరిమితి ఉందని వారు గుర్తుచేస్తున్నారు ఎటూ కొత్తగా లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారు గనుక, నిరుద్యోగుల్లో అసంతృప్తి రాదు అని ఉద్యోగులు వాదిస్తున్నారు. ప్రభుత్వానికి కొత్తగా వచ్చే నష్టం లేదు గనుక కెసిఆర్ త్వరలోనే వీరి కోరిక తీరుస్తరని ఊహాగానాలు నడుస్తున్నాయి. అదే జరిగితే కెసిఆర్, చంద్రబాబు బాటను అనుసరించినట్లు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close