రాజ‌ధాని విష‌యంలో సీఎం జ‌గ‌న్ మీద ఒత్తిడి ఉందా..?

మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ప్ర‌క‌టన చేసిన ద‌గ్గ‌ర్నుంచీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌య‌మై తీవ్ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వైకాపాతోపాటు భాజ‌పా నేత‌లు కూడా స్పందిస్తున్నారు. ఈ విష‌యంలో కేంద్రం సూచ‌న‌లూ స‌ల‌హాలూ ఉంటాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి చెబితే… మాకేం సంబంధం, అది స్టేజ్ స‌బ్జెక్ట్ అంటూ భాజ‌పా ఎంపీ సుజ‌నా చౌద‌రి అంటారు. రాజ‌ధాని నిర్మాణానికి 32 వేల ఎక‌రాలు అవ‌స‌ర‌మా అని ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అంటారు. అవంతి శ్రీ‌నివాస‌రావు మ‌రో మాట అంటారు! ఇలా ఎవ‌రికివారు రాజ‌ధాని మీద తీవ్ర గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌నలో ఉన్న ముఖ్య‌మంత్రి జగ‌న్మోహ‌న్ రెడ్డి స్పంద‌నేంటి..? ఇక్క‌డ జ‌రుగుతున్న చ‌ర్చ ఆయ‌న‌కి తెలియ‌దా..? ఆయ‌న‌కి చెప్ప‌కుండా రాజ‌ధాని అంశంపై బొత్స‌, ఆళ్ల‌, అవంతి, అంబ‌టి లాంటి నేత‌లు మాట్లాడేస్తుంటారా..? ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి వైఖ‌రి ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

అధికార పార్టీ నేత‌ల్లో వినిపిస్తున్న గుస‌గుస‌లు ఏంటంటే… రాజ‌ధాని అమ‌రావ‌తిలో పెట్ట‌డం వ‌ల్ల అక్క‌డ ఓ బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం లాభ‌ప‌డింద‌నీ, చుట్ట‌ప‌క్క‌ల పెద్ద ఎత్తున భూముల క్ర‌య విక్ర‌యాలు వారే చేసుకున్నార‌నీ, మ‌నం అధికారంలోకి ఇప్పుడొచ్చాం కాబ‌ట్టి… మ‌న ప‌రిస్థితి ఏంట‌నేది కొంత‌మంది ఒత్తిగా ఉంద‌ట‌! ఇదే విష‌య‌మై ఎన్నిక‌ల ముందు నుంచి కూడా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన నేత‌ల నుంచి ఒత్తిడి తెచ్చార‌నీ, అందుకే ఆ స‌మ‌యంలో కూడా అమ‌రావ‌తి అంశ‌మై ఆయ‌న స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌లేకపోయారనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నేరుగా వేదిక‌ల మీద ఎవ్వ‌రూ మాట్లాడ‌క‌పోయినా, ఎన్నిక‌ల స‌మ‌యంలో రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల్లో ఈ భావ‌న‌ను క్షేత్ర‌స్థాయిలో వైకాపా క్రియేట్ చేసింద‌నీ ప్ర‌చారం జ‌రిగింది.

అధికారంలోకి వ‌చ్చాక కూడా మ‌ళ్లీ అమ‌రావ‌తి ప్రాంతాన్నే అభివృద్ధి చేసుకుంటూ పోతే… చంద్ర‌బాబు హ‌యాంలో ఏ సామాజిక వ‌ర్గానికైతే మేలు జ‌రిగిందో, మ‌ళ్లీ వాళ్ల‌కే లాభం చేకూర్చిన‌ట్టు అవుతుందనే ఒత్తిడి సీఎం మీద ఇప్పుడు ఉంద‌ని అధికార పార్టీలో ఓ చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది. రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచి వ‌స్తున్న ఒత్తిడికి అనుగుణంగా రెండు రాజ‌ధానులు ఉండేలా ఏదైనా ప్ర‌తిపాద‌న తెర‌మీదికి తెస్తారా, తిరుప‌తి కేంద్రంగా ఆ అవ‌కాశం ఉంటుందా అనే గుస‌గుస‌లు కూడా వైకాపా వ‌ర్గాల్లో వ్య‌క్త‌మౌతున్నట్టు తెలుస్తోంది. అందుకే ముఖ్య‌మంత్రి ఈ అంశంపై వెంట‌నే స్పందించ‌లేక‌పోయార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close