కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే .. నారా లోకేష్ అప్రోచ్‌కు తెగ ఫీలైపోతున్నారు. నారా లోకేష్ మంత్రిగా ఉన్న తన రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఆయన ఏ రాష్ట్రాన్ని ఆయన కించ పర్చడం లేదు. పారిశ్రామికవేత్తలు ఎవరైనా మంచి ప్లేస్ కోసం.. ప్రోత్సాహకాల కోసం చూస్తూంటే.. వారికి మాత్రం తన విజ్ఞప్తిని చేస్తున్నారు. ఇది కర్ణాటక మంత్రులకు ఎందుకో కానీ తమను అవమానిస్తున్నారన్నట్లుగా ఫీలవుతున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఇంకా ఎక్కువ ఫీలవుతున్నారు. ఆయన ఏపీని కించ పర్చడమే కాదు.. నారా లోకేష్‌తో వాదనకు దిగుతున్నారు. యంగెస్ట్ స్టేట్‌గా పెట్టుబడిదారులకు అవకాశాలు వివరిస్తున్నామని లోకేష్ చెబుతూంటే.. ఆయన తమ రైతు ఫ్రెండ్లీ విధానాలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు. తాజాగా ఎప్పుడో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడిన మాటలను ఇంటర్నెట్లో తీసుకుని.. ఓ పత్రికలో కథనం రాయించారు. దాన్ని పోస్టు చేసుకుని మళ్లీ లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు.
పోటీని ఎప్పుడూ స్వాగతిస్తామని.. సమస్యలను గుర్తించి పరిష్కారాలను అందించడం ప్రతి ప్రభుత్వ విధి అని చెప్పుకొచ్చారు. తమది అహంకారం కాదని.. లోకేష్‌దే అహంకారం అన్నట్లుగా శోభనాద్రీశ్వరరావు ఫోటోతో రాసిన కథనం పెట్టారు. రాజధాని కోసం వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. పారిశ్రామిక సంస్థలకూ సేకరించి ఇస్తోంది. కానీ కర్ణాటక చాలా కొద్ది భూమిని ఇవ్వలేక ఏరోస్పేస్ పార్క్ ను రద్దు చేసుకుంది.అయినా తమ వైఫల్యాన్ని ఇతరులపై రుద్దడానికే ప్రయత్నిస్తున్నారు.