పుట్టుమ‌చ్చ‌ల ప్ర‌శ్న‌తో.. మేలుకున్న పీఆర్వోలు

ఇటీవ‌ల `డీజే టిల్లు` ప్రెస్ మీట్లో ఓ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌.. వివాదాస్ప‌ద‌మైంది. `పుట్టుమ‌చ్చ‌ల`కు సంబంధించిన ఆ ప్ర‌శ్న వైర‌ల్ గా మారింది. ఆ ప్ర‌శ్న హీరోయిన్ ని బాగా ఇబ్బంది పెట్టింది. బాధ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ అవ్వ‌గానే స‌ద‌రు హీరోయిన్ కంట నీరు పెట్టుకుంటూ, అక్క‌డ్నుంచి హ‌డావుడిగా వెళ్లిపోయింది. ఆ ప్రశ్న కు సంబంధించి చాలా ర‌భ‌స‌ జ‌రిగింది. చివ‌రికి.. రిపోర్ట‌ర్ `సారీ` కూడా చెప్పాడు. ఈ ప్ర‌శ్న‌తో.. టాలీవుడ్ పీఆర్వో బృందం మేలుకుంది. ఇక మీద‌ట ప్రెస్ మీట్లో.. ప్ర‌శ్న‌లు అడుగుతున్న‌ప్పుడు వాళ్ల‌పై కెమెరా పెట్ట‌కూడ‌ద‌ని, సంచ‌ల‌నం కోసం ఏమైనా అడిగేసే వాళ్ల‌కు అస‌లు మైక్ ఇవ్వ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింది.

ఇప్పుడు యూ ట్యూబ్ ఛాన‌ళ్ల ప్ర‌భావం, ప్రాబ‌ల్యం బాగా పెరిగిపోయింది. ప్ర‌తీదీ వాళ్ల‌కు సంచ‌ల‌నమే. ప్ర‌శ్న అడిగేవాళ్ల‌పై కూడా కెమెరాలు ఫోక‌స్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ క‌ల్చ‌ర్ పెరిగిందో.. టీవీల్లో క‌నిపిస్తామ‌న్న అత్యుత్సాహంతో… అడ‌గాల్సిన‌వీ, అడ‌క్కూడ‌న‌వి కూడా అడిగేస్తున్నారు కొంత‌మంది రిపోర్ట‌ర్లు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ప్రెస్ మీట్లో కొంత‌మంది పాత్రికేయులు అడిగిన ప్రశ్న‌లు మ‌రీ సిల్లీగా ఉండ‌డంతో.. అవ‌న్నీ బాగా ట్రోల్ అయ్యాయి. వాటివ‌ల్ల పెద్ద‌గా డ్యామేజీ ఏం లేదు గానీ, `డీజే టిల్లు` వ్య‌వ‌హారంతో… స్టేజీమీదున్న‌వాళ్లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. `ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎవ‌రైనా వేస్తారా..` అంటూ ఆ త‌ర‌వాత హీరో, హీరోయిన్లు ట్వీట్లు వేసి త‌మ బాధ‌ని, అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. అందుకే ఆ గొడ‌వలేం ఉండ‌కూడ‌ద‌ని పీఆర్వో యూనియ‌న్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. `డీజే టిల్లు` ప్రెస్ మీట్‌లో ఇబ్బందిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగిన జ‌ర్న‌లిస్టుతో సారీ చెప్పించింది కూడా ఆ సినిమా పీఆర్వో బృంద‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close