చైతన్య : భావి పౌరుల మనసుల్లో విభజన.. దేశ భవిష్యత్‌కు ఏదీ గ్యారెంటీ ?

కర్ణాటక రగిలిపోతోంది. స్కూళ్లు, కాలేజీలకు మూడురోజుల పాటు సెలవులు ప్రకటించారు. దీనికి కరోనా కారణం కాదు. హిజాబ్ వివాదం. కర్ణాటకలో ఎక్కడో ఓ స్కూల్లో ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకంతో మంట అంటుకుంది. అంతంకంతకూ పెరుగుతోంది. చివరికి అది రాళ్ల దాడులు.. కత్తిపోట్లకూ దారి తీసింది. చివరికి అది ఓ వర్గం మనసుల్లో విష బీజాలు నాటుతుంది. యువత గుండెల్ని రగిలించేలా చేస్తుంది. అది దేశానికి ఎంత మాత్రం క్షేమం కాదు. దేశ ప్రజల మధ్య ఐక్యతాభావానికి ఎంత మాత్రం మేలు కాదు.

కర్ణాటక పరిణామాలతో విభిన్నవర్గాల మధ్య పెరగనున్న దూరం !

మంగళవారం దేశం మొత్తం విపరీతంగా చూసిన వీడియో మాండ్యా జిల్లాలో ఓ విద్యార్థిని హిజాబ్‌ వస్తధారణలో కాలేజీకి వచ్చి వెళ్తూంటే ఆమె మీదకు వెళ్తూ కొంత మంది విద్యార్థులు కాషాయా కండువాలు ఊపుతూ జై శ్రీరామ్ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా ఆమె అల్లాహో అక్బర్ అంటూ నినదించారు. ఆమెను అలా రెచ్చగొడుతూ విద్యార్థులు వెంట పడుతూనే ఉన్నారు. ఈ దృశ్యాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నారు ? ఇప్పుడు ఆ యువతినిఆ వర్గం మొత్తానికి ప్రతీకగా చూస్తున్నారు. ఆమెకు జరిగిన ఘటన తమకు జరిగినట్లుగా ఆ వర్గం భావిస్తుంది. ఆమెకు మద్దతుగా ఆ వర్గమే కాదు.. కాస్త ఆలోచనా పరులూ ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితి రెండు వర్గాలుగా విభజిస్తోంది.

హిజాబ్‌ను వ్యతిరేకించాలంటే కాషాయం చూపించాలా ?

హిజాబ్ వేసుకుని విద్యార్థులు స్కులుకు రావాలా వద్దా అన్నదానితో హిందూ సంస్థలకు.. హిందూయిజం అవలంభించేవారికి సంబంధం లేదు. అది కాలేజీ లేదా స్కూల్ నిబంధనలకు సంబంధించిన అంశం. అది కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. లేకపోతే కోర్టు తీసుకుంటుంది.కానీ ఇక్కడ హిందూ సంస్థల పేరుతో కొంత మంది విద్యార్థుల్ని పోగేసి వారికి కాషాయ కండువాలు ఇచ్చి రెచ్చగొట్టే రాజకీయం చేయడంతోనే అసలు విభజన ప్రారంభమయింది. నిన్నటిదాకా వారు కలసి మెలిసి చదువుకున్నారు. కబుర్లు చెబుతున్నారు. ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. కానీ రేపటి నుంచి వారి మధ్య ఓ విభజన ఏర్పడుతుంది. అది ఒకరు ఇద్దరు మధ్య కాదు. కర్ణాటక ఆ మాటకొస్తే దేశం మొత్తంలోని విద్యార్థుల మధ్య ఈ విభజన కనిపిస్తుంది. అది దేశానికి క్షేమమా..? మంచిదా ?

మత రాజకీయాలతో దేశానికి నష్టం చేస్తున్న క్షుద్ర రాజకీయాలు !

దేశానికి ఎవరూ చేయనంత హాని మత రాజకీయాలు చేస్తున్నాయి. భవిష్యత్ పౌరుల మనసుల్లోనూ విషబీజాలు నాటుతున్నారు. ఇప్పటికప్పుడు ఇలాంటి వాటి వల్ల రాజకీయ ప్రయోజనాలు లభిస్తాయేమో కానీ దీర్ఘకాలంలో దేశానికి వారు చేసిన నష్టాన్ని ప్రజలు అనుభవించాలి.భావి భారత పౌరులు అనుభవించాలి. ప్రజలకు నిజాలు తెలియకుండా ఎల్లప్పుడూ భావోద్వేగాల్లో ముంచేసేందుకు సోషల్ మీడియా.. దాన్ని కనికట్టు చేసేందుకు ఎన్నో స్ఫూఫింగ్ టూల్స్‌తో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారు. ఇలా చేయడం దేశభక్తి కాదు.. దేశద్రోహం !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి 123 సీట్లు వస్తాయని నాకు సమాచారం : పరిపూర్ణానంద

రాజకీయాలపై ఆశలు పెట్టుకున్న స్వాములు రాగద్వేషాలకు అతీతులేమీ కాదు. దానికి పరిపూర్ణానందనే సాక్ష్యం. హిందూపురం లోక్ సభ సీటు తనకు దక్కనివ్వలేదని రగిలిపోతున్న ఆయన ఎగ్జిట్ పోల్ చెప్పారు. హిందూపురం అసెంబ్లీకి ఇండిపెండెంట్...

సుప్రీంకోర్టు చెప్పినా తప్పే : సజ్జల

వైసీపీ నేతలు తాము ఏది చెస్తే అది.. ఏం చెబితే అది మాత్రమే ఫైనల్ అనుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును సైతం ... వాళ్లు చెబితే కరెక్టా అని...

క‌థాక‌మామిషు – ఈ వారం క‌థ‌ల‌పై స‌మీక్ష‌

సాహితీ ప్ర‌పంచంలో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. ప్ర‌తీరోజూ ఎన్నో క‌థ‌లు పుడుతుంటాయి. అందులో కొన్ని ప్ర‌చుర‌ణ వ‌ర‌కూ వెళ్తాయి. అలాంటి క‌థ‌ల్ని పాఠ‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న‌దే 'క‌థాక‌మామిషు' ప్ర‌ధాన ఉద్దేశం. ఈ...

మ‌ళ్లీ హ్యాపీడేస్ మొద‌ల‌య్యాయా?

శేఖ‌ర్ కమ్ముల 'హ్యాపీడేస్‌' చాలామంది జీవితాల్ని మార్చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్థిర‌ప‌డిపోయిన‌వాళ్లు ఎంతోమంది. అందులో టైస‌న్ గా మెప్పించిన రాహుల్ కూడా 'హ్యాపీడేస్' త‌ర‌వాత హీరోగా మారాడు. కొన్ని సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close