ప్రొ. నాగేశ్వర్ : డేటా వార్‌కి పరిష్కారం ఏమిటి..?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్న వ్యవహారం.. ఐటీ గ్రిడ్ కేసు విషయం. తమ పార్టీకి చెందిన యాప్.. సేవామిత్ర లో ఉన్న సమచారం మొత్తం దొంగిలించి వైసీపీకి ఇవ్వడానికి ఐటీ గ్రిడ్ అనే సంస్థపై కేసు పెట్టి.. ఆ సంస్థలో ఉన్న సర్వర్లను, ట్యాబ్‌లను, సీపీయూలను తీసుకు పోయారని.. టీడీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అంతా.. ఆ యాప్‌లో ఉందని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగానే.. పోలీసులు కేసు పెట్టి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఇందులో ఎవరి వాదన కరెక్ట్..?

రిటర్న్ గిఫ్ట్‌లో భాగంగానే టీడీపీ టార్గెట్..!

తెలంగాణ కేంద్రంగా.. కొన్ని రోజులుగా.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు యాక్టివ్ పార్ట్ తీసుకుని రాజకీయం చేసినప్పుడు… తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని.. టీఆర్ఎస్ నేత కేటీఆర్ బహిరంగంగా ప్రకటించారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ కూడా చెప్పారు. ఆ కాంటెక్ట్స్‌లో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచిన తర్వాత జగన్‌తో సంబంధాలు మెరుగుపడ్డాయి. ఫెడరల్ ఫ్రంట్‌ పేరుతో.. కేటీఆర్ వెళ్లి.. జగన్‌తో సమావేశమయ్యారు. జగన్ .. ఏపీలో … ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఓడించడం అనేది.. జగన్, కేసీఆర్ ఉమ్మడి లక్ష్యం. ఈ క్రమంలోనే.. ఐటీ గ్రిడ్ కేసు వెలుగులోకి వచ్చింది. డేటా చోరీ.. డేటా వార్ అంటూ.. విషయాలు బయటకు వచ్చాయి. తెలంగాణ పోలీసులు.. ఏపీ పోలీసులు కూడా ఈ విషయంలో కల్పించుకోవడంతో.. వ్యవహారం సీరియస్ అయిపోయింది.

ప్రజల డేటా టీడీపీ యాప్‌లో ఉందంటున్న వైసీపీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఓ ప్రధానమైన ఆరోపణ చేస్తోంది. అదేమిటంటే.. ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేటు సంస్థలకు ఇచ్చిందని చెబుతోంది. నిజానికి దేశవ్యాప్తంగా ఈ డేటా విషయం చర్చనీయాంశమవుతోంది. ఈ డేటాను రాజకీయ అవసరాలకు వాడుకుని మెరుగైన ఫలితాల్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. డేటాను ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలుస్తున్న పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ప్రభుత్వం దగ్గర ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఉదారహణకు.. సంక్షేమ పథకాలకు సంబంధించి… నేరుగా నగదు బదిలీ చేయడానికి.. అన్నదాత సుఖీభవ, నిరుద్యోగభృతి, డ్వాక్రా మహిళలు.. ఇలా.. ప్రజలకు సంబంధించిన డేటా ఉంటుంది. ఇది ప్రభుత్వ కార్యక్రమాలకే ఉపయోగించుకోవాలి. కానీ రాజకీయ పార్టీలు రాజకీయానికి ఉపయోగించుకుంటున్నాయి. అనేక ప్రభుత్వ లబ్దిదారులకు ఉత్తరాలు రాశాయని చదువుతూ ఉంటారు. ఈ డేటా ప్రభుత్వానికదా..!. ఇక్కడ వైసీపీ కూడా అదే ఆరోపణ చేస్తోంది. ప్రజల డేటాను ప్రైవేటు కంపెనీకి ఇచ్చారంటున్నారు. ఓటర్ల లిస్ట్ అందరి దగ్గరా ఉంటాయి. అతి పెద్ద ఇష్యూ కాదు. ఈ డేటాను.. రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని వైసీపీ అంటోంది. ఇది నిజమైతే తీవ్రమైన ఆరోపణ.

తమ యాప్ డేటాను వైసీపీ కోసం టీఆర్ఎస్ చోరీ చేసిందంటున్న టీడీపీ..!

తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం.. ప్రభుత్వం నుంచి ఏ డేటా తీసుకోలేదని చెబుతోంది. టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన యాప్ లో .. టీడీపీ నేతలు, కార్యకర్తలు. బూత్ కమిటీలు..టీడీపీ కార్యకర్తల ఇన్సూరెన్స్ వ్యవహారాలకు సంబంధించిన వివరాలు ఉంటాయని చెబుతోంది. ఈ సర్వీస్ అందించే కంపెనీ హైదరాబాద్ లో ఉండటం వల్ల… వైసీపీ నేతల సూచనలతో.. తెలంగాణ సర్కార్ పోలీసుల్ని పంపి.. ఆ డేటాను కంపెనీ నుంచి తీసుకుని.. వైసీపీ నేతలకు అందిస్తున్నారని ఆరోపిస్తోంది. అందువల్ల టీడీపీ వద్ద ఉన్న సమాచారంతో పాటు.. బూత్ లెవల్ కార్యకర్తల సమాచారం తీసుకుని.. వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు… వైసీపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని చెబుతోంది. ఇది నిజమైతే చాలా సీరియస్‌ ఇష్యూ. ఓ రాజకీయ పార్టీ డేటాను..మరో రాజకీయ పార్టీ సహకారంతో తీసుకోవడం అంటే.. చాలా దారుణం. ఈ రెండింటిలో ఏది నిజం అనేది.. మనం నిర్ణయించలేం. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితేనే బెటర్..!

టీడీపీ యాప్‌లోని సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తే కానీ.. విషయం తెలియదు. ఒకరి విచారణపై మరొకరికి నమ్మకం ఉండదు. అందుకే.. హైకోర్టు పర్యవేక్షణలో.. ఈ కేసు విచారణ జరగాలి. న్యాయం చేయడమే కాదు.. న్యాయం చేసినట్లుగా కూడా కనబడాలి. అందుకే.. దీనికి హైకోర్టు పర్యవేక్షణలో విచారమ చేయిండమే ముఖ్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.