ప్రొ.నాగేశ్వర్ : ద్రవిడ రాజకీయ యోధుడు కరుణానిధి…!

కరుణానిధి ద్రావిడ రాజకీయాలకు ఓ సింబల్. ఓ పెరియార్ రామస్వామి, అన్నాదురై వంటి వారి కొనసాగింపుగా కరుణానిధి ఉన్నారు. లివింగ్ లెజెండ్ గా కరుణానిధి ఉన్నారు. ఆయన చేసిన రాజకీయాలు, వేసిన ఎత్తుగడలపై విమర్శలు ఉండవచ్చు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు కూడా. కానీ తమిళ రాజకీయాల్లో ద్రావిడ ఉద్యమనేతగా.. డీఎంకే అధినేతగా.. ఓ ప్రత్యేకత ఉంది.

ద్రావిడియన్ సిద్దాంతాల ఉద్యమమే డీఎంకే..!

డీఎంకే అనేది వాస్తవంగా ఓ రాజకీయ పార్టీ కాదు. తమిళ సమాజాన్ని కదిలించినటువంటి ఓ సామాజిక ఉద్యమం. దీని క్యారెక్టర్‌లో మనకు రెండు, మూడు అంశాలున్నాయి. తమిళ రాజకీయాల్లో కులాన్ని ప్రశ్నించి.. కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి… అణగదొక్కబడిన కులాలకు సాధికారితను..ఏదో రాజకీయాల కోసమో.. ఓట్ల కోసమో కాకుండా.. సైద్ధాంతికంగా ఉద్యమం చేయడానికి డీఎంకే ఏర్పడింది. తర్వాతి కాలంలో డీఎంకే భావజాలం నుంచి చాలా వరకూ డైల్యూట్ అయింది. ఇప్పటి రాజకీయాల్లో అది లేదు. ఈ రోజు రాజకీయాల్లోకి సినిమా వచ్చింది. గ్లామర్ వచ్చింది. కానీ ద్రవిడియన్ రాజకీయాలకు ప్రాధాన్యత తగ్గలేదు. రజనీకాంత్ కొత్తగా పార్టీ ప్రకటించారు. తనవి ద్రవిడియన్ సిద్ధాంతాలు కావని.. పూర్తిగా అధ్యాత్మిక రాజకీయాలను చెప్పుకున్నారు. అయినా కరుణానిధి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారు. జయలిలత కూడా.. పెరియార్ రామస్వామి, అన్నాదురై పేర్లు చెప్పుకండా… రాజకీయాలు చేయలేదు. అంటే.. తమిళనాడులో ద్రవిడియన్ సిద్ధాంతాలు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితి ఉంది.

బ్రాహ్మణిజంపై పోరాడిన కరుణానిధి..!

డీఎంకేను ఏర్పాటు చేయడంలో కరుణానిధిది కీలకపాత్ర. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా తమిళ రాజకీయాల్లో ఓ ఉద్యమం నడిపారు. కరుణానిధి నడిపించి బ్రాహ్మిణ్ వ్యతిరేక ఉద్యమం అనుకుంటారు కొంత మంది. కానీ బ్రాహ్మిణ్ వేరు.. బ్రాహ్మణిజం వేరు. కుల వ్యవస్థను గొప్పగా చెప్పి.. అది ఉండాలని చెప్పడాన్ని బ్రాహ్మణిజం అంటారు. భారతదేశంలో ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. రెండోది ఏమిటంటే… తమిళ్ జాతీయత. అక్కడ రాజకీయాల్లో తమిళజాతీయత ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. భారతదేశం అంతా ఒకే జాతి అని అందరూ చెబుతూంటారు. కానీ గాంధీ గారు.. భారతదేశం అంటే అనేక జాతుల సమ్మేళనం అన్నారు. అందుకే తమిళవాదం ఓ ప్రాతిపదికగా వచ్చింది. చాలా సందర్భాల్లో ఓ అడుగు ముందుకు వేసి తమిళవాదం ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. తమిళవాదాన్ని వ్యతిరేకించేవారు.. డీఎంకేను ఓ వేర్పాటు వాద సంస్థగా చెప్పడం జరిగింది.

ద్రవిడ సిద్ధాంతాలు డైల్యూట్ అయినా ప్రజల మనసుల్లో ఉన్నాయి..!

కానీ రాను రాను డీఎంకే కేంద్రంలో ఎవరుంటే వాళ్లతో రాజీ పడటం… కేంద్రంలో జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. దాగుమూతులు ఆడటం.. ద్రవిడియన్ పాలిటిక్స్ లో వచ్చిన మార్పు. ఇంకోకటి ఏమింటంటే.. హిందీ- హిందూ వ్యతిరేక రాజకీయాలు. మీరు ఈ మధ్య చూసే ఉంటారు. తమిళనాడులోని కొంత మంది బీజేపీ రాజకీయ నాయకులు పెరియార్ స్థూపాల్ని కూల్చేస్తామని ప్రకటించారు. బీజేపీ ద్రావిడ రాజకీయాల్ని అంగీకరించలేకపోయింది. మతాధిపత్యానికి వ్యతిరేకంగా కూడా ద్రవిడియన్లు పోరాడారు. కులాధిపత్యానికి, మతాధిపత్యానికి, హిందీ డామినేషన్ కు వ్యతిరేకంగా ద్రవిడియన్ మూవ్ మెంట్ వచ్చింది. కాలక్రమేణా ఇవన్నీ డైల్యూట్ అయిన మాట మాత్రం నిజం. అయినా ఇప్పటికీ.. ద్రావిడ సిద్ధాంతాల్ని పట్టుకునే రాజకీయాలు చేయాల్సి వస్తోంది. దీనికి కారణం.. ద్రవిడ ఉద్యమం ప్రభావం.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కరుణానిధి ఉద్యమం ఉన్నాయి.

కురణానిధి ద్రవిడ రాజకీయాల్లో చెరుపలేని సింబల్..!

జయలలిత ఓ వైపు బ్రాహ్మణిజం రాజకీయాలు..మరో వైపు ద్రవిడయన్ రాజకీయాలు చేశారు. ఈ రెండింటిని మిక్సప్ చేస్తూ.. తన గ్లామర్, ఎంజీఆర్ గ్లామర్.. కలిపి..ఓ కొత్త రాజకీయ ఒరవడిని సృష్టించారు. అన్నాద్రవిడ మున్నేట్రకజగం అయినప్పటికీ కూడా జయలలిత ఎంట్రీతోనే.. ద్రవిడియన్ మూవ్‌మెంట్‌లో ఆ స్పిరిట్ లేదు. ఇప్పుడు జరిగేవి ద్రవిడియన్ పాలిటిక్స్ కావు. జయలలిత శంకరాచార్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ప్రచారాన్ని మొదలు పెట్టినప్పుడే.. జయలలిత… చేసేది ద్రవిడియన్ రాజకీయాలు కాదని తెలిసిపోతుంది. అయితే డీఎంకే మాత్రం ద్రవిడ రాజకీయాలకు స్పూర్తిగా ఇప్పటికీ కొనసాగుతున్నతోంది. దీనికి కారణం కరుణానిధినే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close