పళనిస్వామి “సమాధి” రాజకీయం..!

కలైంజ్ఞర్ కరుణానిధిని… ఇతర తమిళ లెజండరీ లీడర్లలా.. మెరీన్ బీచ్‌లోనే… ఖననం చేయాలని కరుణానిధి కుటుంబ సభ్యులు భావించారు. మొదట డీఎంకే నేతలు వచ్చి అడినప్పుడు సరే అన్న పళనిస్వామి తీరా కరుణానిధి మరణవార్త బయటకు వచ్చిన తర్వాత..మాత్రం తూచ్ అన్నారు. కోర్టులో ఉన్న పిల్స్‌ను సాకుగా చూపి.. మెరీనా… కరుణానిధి ఖననానికి, స్మారక స్థూపానికి స్థలం ఇవ్వలేమని మొండి పట్టుకు పోయారు. దీంతో పళనిస్వామి నిర్ణయం పెను రాజకీయ దుమారానికి కారణం అయింది. జమ్మూకశ్మీర్‌లోని ఒమల్ అబ్దుల్లా దగ్గర్నుంచి… తమిళ సినీ పరిశ్రమలోని తారలందరూ.. ముక్త కంఠంతో కలైంజ్ఞర్ కరుణానిధికి మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు నిర్వహించే అర్హత ఉందని నినదించారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

డీఎంకే.. అర్థరాత్రి… హైకోర్టు తలుపులు తట్టింది. గతంలో మెరీనా బీచ్‌లో… ఇలా మెమెరియల్స్ నిర్మించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని కొంత మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. ఆ పిటిషన్లు వేసిన వారు ఉన్నపళంగా తమ తమ పిటిషన్లు ఉపసంహరించుకున్నట్లు లేఖలు ఇచ్చారు. తమ పిటిషన్లను ప్రభుత్వం రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి వాడుకుంటోందని వారు ఆరోపించారు. అన్నాదురై మెమెరియల్ పక్కన కరుణానిధి సమాధిని కూడా ఉంచితే.. భవిష్యత్‌లో అన్నాడీఎంకే రాజకీయ ఇమేజ్‌కు ఇబ్బందికరమైన పళనిస్వామి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పర్మిషన్ లేదన్న ప్రచారం జరుగుతోంది.

తమిళనాడుకు దశాబ్దాల పాటు సేవలందించిన దిగ్గజ వ్యక్తి అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం రాజకీయం చేయడం అక్కడి ప్రజలను కూడా తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. డీఎంకే క్యాడర్ కూడా అసహనానికి గురవుతోంది. పలు చోట్ల ఆందోళనలు చెలరేగాయి. లాఠీచార్జ్ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సహా అనేక మంది… మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం కోర్టులోనే వాదనలు వినిపించాలని నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close