ప్రొ.నాగేశ్వర్ : మహాకూటమి గెలవబోతోందన్న పబ్లిక్ టాక్ వచ్చిందా..?

తెలంగాణలో ఇప్పుడు రాజకీయం ఊపందుకుంది. కేసీఆర్.. హఠాత్తుగా.. 106 గెలుస్తాం.. 108 గెలుస్తామని లెక్క చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ తక్కువ తినలేదు. మహాకూటమికి ఎనభై ఐదు సీట్లు వస్తాయని ప్రకటించుకుంది. ఇక బీజేపీ తమకు ఇరవై ఐదు సీట్లు వస్తాయంటోంది. ఇక ఎంఐఎంకి ఎనిమిది సీట్ల లెక్క ఉండనే ఉంది. అలా ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. కానీ… వాస్తవ పరిస్థితి మాత్రం అంత తేలిగ్గా ఎవరూ అంచనా వేయలేరు.

ఓడిపోతామన్న మాట కేసీఆర్ నోట ఎందుకొచ్చింది..?

కేసీఆర్ మూడు రోజుల కింట.. ఆదిలాబాద్ లో.. నేను ఓడిపోతే.. నాకేం నష్టం లేదు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా.. ! ప్రజలకే నష్టమంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. అధికారం ఉంటనే పని చేస్తావా.. ఓడిపోతే.. ప్రజలకు సేవ చేయకుండా వెళ్లిపోతావా అని చాలా మంది విమర్శలు గుప్పించారు. ఓడిపోయినా.. గెలిచినా ప్రజల్లో ఉండేవాడే నాయకుడని.. విమర్శలు వచ్చాయి. అయితే ఇందులో.. అసలు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ.. కేసీఆర్ నోట.. ఓటమి అనే మాట రాలేదు. అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి ఆయన వంద సీట్ల లెక్క చెబుతూనే ఉన్నారు. ఇప్పుడే కాదు.. ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ రాలేదు. కేసీఆర్ చాలా విశ్వాసాలు, నమ్మకాలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి.. నేను ఓడిపోతే.. అన్న అపశకునాన్ని ఎందుకు మాట్లాడారన్నది ఆసక్తికరం. నిజానికి అది కేసీఆర్ స్టైల్ కాదు. గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారన్న భావం.. కేసీఆర్ మాటల్లో వస్తుంది. ఆయన రకరకాల సర్వేలు చేయించుకుంటారని.. ఇంటలిజెన్స్ సర్వేల్లో కూడా వచ్చి ఉంటుందని.. ఓడిపోతున్నాడని ఆయనకు తెలిసింది కాబట్టే ఆ మాటలు మాట్లాడున్నారని.. ఓ వాదన ఉంది. దాన్ని తిప్పికొట్టడానికి.. తన శ్రేణులకు.. ఉత్సాహాన్ని ఇవ్వడానికి… వంద అంటే పాత మాటే అవుతుంది కాబట్టి.. 106 … 108 అంటూ చెబుతున్నారు. కేసీఆర్ పెంచగలిగితే.. 112కి పెంచగలరు కానీ.. ఇంక పెంచలేరు. ఆ ఏడు స్థానలాలో ఎంఐఎం ఉంటుంది మరి…!

మహాకూటమి గెలవబోతోందని ప్రజలు ఎందుకనుకుంటున్నారు..?

నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు.. నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగాను. రాజకీయ వాతావరణం చాలా పోటాపోటీగా ఉన్న మాట నిజం. కానీ సామాన్యుల్లో మాత్రం.. కామన్‌టాక్‌గా.. మహాకూటమి గెలుస్తుంది..మహాకూటమి అధికారంలోకి వస్తుందనే కామన్ టాక్ ఉంది. దీన్ని సామాన్యులు కూడా నమ్ముతున్నారు. ఇదే టీఆర్ఎస్ వర్గాలను ఓ రకంగా ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి కారణం ఏమిటంటే… అసెంబ్లీని రద్దు చేసినప్పుడు… టీఆర్ఎస్‌కు… కాంగ్రెస్‌కు మధ్య చాలా గ్యాప్ ఉంది. అప్పటికి టీఆర్ఎస్ చాలా హై రెంజ్‌లో ఉంది. ఇక ఎదగడానికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పెరగడం ప్రారభించింది. పెరుగుదల కాంగ్రెస్‌తో ఉంది కాబట్టి.. సహజంగానే… పాజిటివ్ వేవ్ రావడం కనిపించింది.

కేసీఆర్ ఓడిపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే కారణమా..?

అలాగే..కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకత కూడా చాలా వర్గాల్లో ఉంది. ఇలా వ్యతిరేకత ఉన్న వర్గాలయిన.. యువత, ఉద్యోగాలు.. ఇతర వర్గాలు.. రాజకీయ పరిస్థితులపై.. విస్తృతంగా చర్చిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత తెలియజేస్తున్నాయి. ఈ వోకల్ సెక్షన్ వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. మామూలుగా ఇతర వర్గాల్లో ఫీడ్ బ్యాక్ త్వరగా బయటకు రాదు. ఈ వోకల్ సెక్షన్ల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా వస్తోంది. ఇంకో కారణం ఏమిటంటే.. అభ్యర్థులు. టీఆర్ఎస్ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చారు. వారిలో చాలా మంది వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దాంతో వారు వీక్ అయ్యారు. మరో వైపు మహాకూటమి అభ్యర్థులు బలంగా ఉన్నారు. అభ్యర్థుల పరంగా.. చూస్తే మహాకూటమి అభ్యర్థులు బలంగా ఉన్నారనే .. అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. ఈ అభిప్రాయం కూడా టీఆర్ఎస్‌లో ఉంది. కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు.. కనీసం 20 సీట్లలోఅభ్యర్థుల్ని మారుస్తారని అనుకున్నారు. కానీ ఎవర్నీ మార్చలేదు. రేపు ఒక వేళ టీఆర్ఎస్ ఓడిపోతే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే కారణం.

కాంగ్రెస్ నేతలు అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవడంలో సక్సెస్ అయ్యారా..?

మహాకూటమి తన సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నిస్తోంది. గెలుస్తుందా… గెలవదా అన్న విషయం పక్కన పెడితే.. మహాకూటమి నేతలు.. తాము గట్టిగా పోరాడుతున్నామనే ప్రయత్నాన్ని మాత్రం చేశారు. పోటీ ఇవ్వబోతున్నామన్న స్థాయిలో.. ఓ రాజకీయ వాతావరణాన్ని.. క్రియేట్ చేయడంలో మహాకూటమి నేతలు… సక్సెస్ అయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం కూడా.. తెలంగాణపై దృష్టి పెట్టింది. వారికి కూడా ఆశలు కలిగాయి. ఈ కారణంగా మహాకూటమి గెలుస్తుందన్న వాతావరణం ఏర్పడింది. అయితే.. టీఆర్ఎస్ పాలన పట్ల..ఓ సార్వత్రిక అసంతృప్తి లేదు. అసంతృప్తి ఉన్నా… అది అన్ని వర్గాల్లోనూ లేదు. సార్వత్రిక అసంతృప్తి ఉంటే.. ఈ ప్రభుత్వాన్ని ఓడించాలనుకుంటారు. అలా కాకపోతే.. అధికారంలో ఉంచాలనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఓడించాలన్నంత అసంతృప్తి లేదు. కచ్చితంగా.. అధికారంలోకి తీసుకు రావాలన్నంత అనుకూలత కూడా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.