అశ్వారావుపేట రివ్యూ : టీడీపీకి క్లియర్ అడ్వాంటేజ్ ఉందా..?

మహాకూటమి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ.. తీసుకున్న నియోజకవర్గాల్లో ఒకటి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన అశ్వారావుపేట. ఏపీ బోర్డర్‌లో ఉండే.. ఈ ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకుందో… కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చిందో.. ఇంకెవరూ ఎందుకు పట్టబట్టలేదో.. ఆ నియోజకవర్గం గురించి తెలిసిన వాళ్లకే కాస్తంత క్లారిటీ ఉంటుంది. అక్కడ… తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావును ప్రకటించగానే.. సగం విజయం ఖరారైపోయినట్లుగా.. మహాకూటమి నేతలు భావించారు. కారణం.. మెచ్చా నాగేశ్వరరావు .. గత ఎన్నికల్లోనూ టీడీపీ తరపునే పోటీ చేశారు. ఆయన గెలుపు ఖాయమని ప్రచారం జరిగింది. చివరికి 930 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. కార్యకర్తలను కాపాడుకున్నారు. ఫలితంగా.. టీడీపీ నేతలు కూడా.. ఆ నియోజకవర్గాన్ని పొత్తులో పోకుండా … టీడీపీకి కేటాయించేలా చేసుకున్నారు.

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది. తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆయితే తర్వాత మారిన పరిస్థితుల్లో వైసీపీ క్యాడర్ మొత్తం.. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల్లో చేరిపోయింది.

భద్రాద్రి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం పూర్తి అటవీ ప్రాంతంతో ఉంది. ఆంధ్రాతో సరిహద్దు పంచుకుంటున్న ఈ ప్రాం తం ఆది నుంచి విభిన్న రాజకీయాలకు నెలవైంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి చిన్నాచితకా వరకు 12 మంది పోటీలో ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న తాటి వెంకటేశ్వర్లు కోసం.. తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కానీ అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకోలేదని భావించిన టీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరిపోయారు. మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్‌, సీపీఐ, టీజెఎస్‌ బలం తమకు కలసివస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తాటి వెంకటేశ్వర్లుపై వ్యక్తిగత వైరంతో వున్న పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కూటమి అభ్యర్థికి మద్దతు పలకుతున్నారు. తాటి వెంకటేశ్వర్లపై అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.

బీజెపీ అభ్యర్థి భూక్యా ప్రసాదరావు గత ఎన్నికల్లో ఇండిపెడెంట్‌గా పోటీ చేసి పది వేల ఓట్ల వరకూ తెచ్చుకున్నారు. ఈ సారి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈయన కూడా భారీగానే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. సీపీఎం అభ్యర్థి తానం రవీందర్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ అభ్యర్థి కంగాల కల్లయ్య పోటీలో వున్నారు. ఈ రెండు పార్టీలు పో డుభూముల సమస్యలపై పోరాడుతున్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రెండు పార్టీలకు పట్టు ఉంది. బీఎల్‌ఎఫ్‌ మెనిపెస్టోను సీపీఎం నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close