ప్రొ.నాగేశ్వర్ : టీడీపీలో హరికృష్ణ ఎందుకు ఎదగలేకపోయారు..?

నందమూరి హరికృష్ణ.. చైతన్యరథాన్ని కొన్ని వేల కిలోమీటర్ల దూరం నడిపారు. ఎన్టీఆర్ ఉన్న చైతన్యరథాన్ని అన్ని వేల కిలోమీటర్లు నడిపారంటే… డ్రైవింగ్‌లో కానీ.. రోడ్డు భద్రత విషయంలో కానీ.. ఆయనకు ఎంతో అవగాహన ఉండి ఉండాలి. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎన్టీఆర్ కుమారుడిగానే కాకుండా… టీడీపీ విజయయాత్రలో… కీలక పాత్ర పోషించిన వ్యక్తి హరికృష్ణ. ఓ రకంగా చెప్పాలంటే.. ఆయన చంద్రబాబునాయుడు కంటే ముందుగానే టీడీపీ ఉన్న నేత.

హరికృష్ణకు ఆవేశం, భావోద్వేగం ఎక్కువ..!

నందమూరి హరికృష్ణ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. కొంతకాలం పాటు టీడీపీ నుంచి బయటకు వెళ్లి.. సొంత పార్టీ పెట్టుకుని.. విజయం సాధించలేక.. మళ్లీ టీడీపీలో చేరారు. కారణం ఆయన బాగా కోపం, ఎమోషనల్ కావడం కావొచ్చు. గతంలో చంద్రబాబుతో విబేధించి సొంత పార్టీ పెట్టారు. అలాగే.. రాష్ట్ర విభజన విషయంలో చాలా మంది నాటకాలు ఆడుతున్నా… హరికృష్ణ మాత్రం.. సీరియస్‌గా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదింపచేసుకున్నారు కూడా. అందుల్ల రాజకీయాల్లో ఆవేశం, ఎమోషన్, భావోద్వేగం కలిగినటువంటి వ్యక్తి హరికృష్ణ. రాజకీయాల్లో ఆచితూచి, వ్యూహాలు ఆలోచించి… సమయం చూసుకుని వ్యవహారాలు నడపలేదు. ఆయన రాజకీయ జీవితం గొప్పగా సాగకపోవడానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు.

2009లో టీడీపీ గెలిచి ఉంటే టీడీపీలో హరికృష్ణ కీలకమయ్యేవారు..!

2009లో జూనియర్ ఎన్టీఆర్… తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉన్నట్లయితే.. సహజంగానే పార్టీలో హరికృష్ణకు ప్రాధాన్యం పెరిగేది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన అనేక నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికలకు వచ్చే సరికి చంద్రబాబునాయుడుకి… హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేకుండా పోయింది. 2009 సమయంలో… టీడీపీలో హరికృష్ణ కీలకంగా ఉన్నారని చెప్పుకోవాలి. అంతకు ముందు… హరికృష్ణ రవాణా శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన సమయంలో తప్ప… చంద్రబాబునాయుడుతో ఎన్టీఆర్ కుటుంబం సన్నిహితంగా ఉన్న సందర్భాలు చాలా తక్కువే. లక్ష్మిపార్వతి ఇష్యూలో… ఎన్టీఆర్ పై తిరుగుబాటు విషయంలో.. కుటుంబం అంతా చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత కూడా హరికృష్ణ.. చంద్రబాబుకు దూరమయ్యారు. దగ్గరయ్యారు.

బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హరికృష్ణకు తగ్గిన ప్రాధాన్యం..!

ఇటీవలి కాలంలో ఆయన టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారని పత్రికల్లో ప్రచారం జరిగింది. ఎప్పుడైతే.. హరికృష్ణ సోదరుడు… బాలకృష్ణ .. చంద్రబాబునాయుడికి వియ్యంకుడయ్యాడో.. అప్పటి నుంచి బాలకృష్ణకు టీడీపీలో ప్రాధాన్యత పెరిగింది. చంద్రబాబుకు వియ్యంకుడయ్యేవరకూ.. బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఎప్పుడైతే బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం నుంచి పోటీ చేశారో.. అప్పటి నుంచే… హరికృష్ణ ప్రాధాన్యం కొద్దిగా తగ్గింది. అయితే.. హరికృష్ణ తనతో ఎప్పుడు విబేధించినా… చంద్రబాబు మాత్రం.. పార్టీలో హరికృష్ణకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. బయటకు వెళ్లి వచ్చినా.. సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత రాజ్యసభ ఇచ్చారు. పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ కూడా ఇచ్చారు. అందువల్ల అవకాశాలు వచ్చినా… పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు.

హరికృష్ణను నిర్లక్ష్యం చేయని చంద్రబాబు..!

ఎన్టీఆర్‌ చైతన్యరథాన్ని నడిపి… రామారావుతో పాటు రాజకీయ భవిష్యత్‌ను కాస్త ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం దొరికినా.. పెద్దగా ఉపయోగించుకోలేదు. చంద్రబాబుకు ఉన్నంత నాయకత్వ లక్షణాలు లేకపోవడం కావొచ్చు.. హరికృష్ణ.. ఎదగలేకపోయారు. ఫ్యామిలీ పాలిటిక్స్‌లో … చంద్రబాబుకు ప్రత‌్యాయ్నాయ నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. కానీ ఎక్కడా కూడా విజయవంతం చేయలేదు. యాక్సెప్టెన్స్ రాలేదు. అలాగే చంద్రబాబు కూడా.. దూరమైనప్పుడు పట్టించుకోలేదు.. దగ్గరైనప్పుడు ఆదరించారు. అంటే ఓ రకంగా పూర్తిగా వదులుకోలేదు.. అలాగని.. పూర్తిగా ప్రాధాన్యం ఇవ్వలేదు. బాలకృష్ణ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత అవకాశం హరికృష్ణకు రాలేదు. ఆ అవసరం చంద్రబాబుకు రాలేదు.

చంద్రబాబు చాలెంజ్ చేసేవాళ్లు లేనట్లేనా..?

నారా లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత నందమూరి కుటుంబం నుంచి చంద్రబాబుకు రాజకీయ సవాళ్లు లేకుండా పోయాయని చెప్పవచ్చు. హరికృష్ణ మరణంతో ఇంకే సవాళ్లు చంద్రబాబుకు ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పురందేశ్వరి.. ఇతర పార్టీల్లోనే ఉన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి దూరమైన తర్వతా చంద్రబాబుకు చాలెంజ్ చేసే అవకాశం లేదు. హరికృష్ణ కూడా.. వేరే పార్టీల్లో చేరలేదు. సొంత పార్టీ పెట్టుకున్నారు కానీ.. ఇతర పార్టీల్లో చేరలేదు. ఏ విధంగా చూసినా.. ఇప్పుడు.. చంద్రబాబునాయుడికి కుటుంబంలో సవాల్ చేసే నేతలు లేరని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీలోకే వస్తారు.

ప్రత్యామ్నాయ నేతగా ఎదిగే ప్రయత్నం ఫలించలేదు..!

తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ పాత్ర మొదటి నుంచి కీలకమే. మొదటి నుంచి అంటే వ్యవస్థాపక దశ నుంచి.. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో అడుగులో అడుగు వేసిన వారిగా.. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం కోసం కూడా అప్పుడప్పుడూ.. ప్రయత్నించి విఫలమయ్యారు. బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నా.. ఆయన ఇతర పార్టీల్లో చేరలేదు. అంటే.. తెలుగుదేశం పార్టీ నుంచి దరంగా ఎప్పుడూ పోలేదు. ఆ రకంగా తెలుగుదేశం.. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధమైన సైనికుడిగా… ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో.. చివరి వరకూ.. ఉన్న నేతగా చరిత్రలో ఉండిపోతారు. తనకంటూ.. ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసినా.. ఆ ప్రయత్నం ఎంత బలహీనంగా ఉన్నా.. ఓ ప్రయత్నం అయితే చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో.. టీడీపీలోనే ఉంటూ… తన కంటూ.. ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి హరికృష్ణ. పురందేశ్వరి బయటకు వెళ్లిపోయారు కాబట్టి.. ఈ కేటగిరిలోకి రారు. పార్టీ ఇచ్చిన పదవులు తప్ప.. ప్రత్యేకంగా తాను ఏమీ సాధించకపోయినా.. తన వ్యక్తిత్వం, రాజకీయ అడుగులతో మాత్రం… టీడీపీలో ఓ విలక్షణ నేతగా ఉండిపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com