ప్రొ.నాగేశ్వర్: రోడ్డు ప్రమాదాలను నివారించలేమా..?

రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఇలాంటి ప్రమాదాల్లో వీఐపీలు చనిపోయిననప్పుడు.. మీడియాలో ప్రమాదాల అంశం హైలెట్ అవుతోంది. సామాన్యులు చనిపోయినప్పుడు అప్పుడప్పుడూ వార్తలొస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది వీఐపీలు రోడ్డు ప్రమాదాల బారినపడి చనిపోయారు. ఎర్నన్నాయుడు, లాల్ జాన్ భాషా, ఇంద్రా రెడ్డి.. రాజస్థాన్ లో రాజేష్ పైలట్ లాంటి వాళ్లు రోడ్డు ప్రమాదాల్లో..చనిపోయారు. అలాగే విమాన ప్రమాదాల్లో మాధవరావు సింధియా, బాలయోగి, రాజశేఖర్ రెడ్డి లాంటి ప్రముఖులు మరణించారు.

ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షన్నర మంది మృతి..!

ప్రముఖుల సంగతి పక్కన పెడితే.. అధికారిక లెక్కల ప్రకారం.. 2016లో 1,50, 785 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయారు. ఇది 2016 లెక్కలు. 2017 లెక్కలు ఇంకా రాలేదు. నిజానికి అవన్నీ రికార్డయినవి. రికార్డు కాని మరణాలు చాలా ఉంటాయి. ఎలా ఉన్నా.. దేశంలో ప్రమాదాల వల్ల లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2015తో పోలిస్తే.. 2016లో మూడు శాతానికి కన్నా ఎక్కువగా ఈ మరణాలు పెరిగాయి. నిజానికిఈ సమయంలో… రోడ్లు విస్తరిస్తున్నారు. ఆధునీకరిస్తున్నారు. ఇంజినీరింగ్ డెలవప్ అవుతోంది. అయినా కూడా ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకిలా పెరుగుతున్నాయనేది చాలా పెద్ద సందేహం. దీనిపై సుందర్ కమిటీ అనే ఓకమిటీని నియమించారు. సుప్రీంకోర్టు కూడా.. డాక్టర్ రాజశేఖర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో… రోడ్ సేఫ్టీ కేసులో ఈ విషయాన్ని ప్రస్తావించింది. అంటే ఈ విషయం… సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.

విదేశీ రోడ్ల ప్రమాణాలకు అనుగుణంగా కార్ల తయారీ..!

నందమూరి హరికృష్ణ విషయంలో… ప్రమాదానికి కారణం అతి వేగం అని చెబుతున్నారు. మీడియాలో వస్తున్న దాని ప్రకారం గంటకు 160 కిలోమీటర్ల వేగంతో… హరికృష్ణ కారు ప్రయాణిస్తోంది. ఇది చాలా హైస్పీడ్. భారత రోడ్ల కండిషన్లకు ఆ వేగం సూటబుల్ కాదు. ఇప్పుడు మన దేశంలో అమ్ముడవుతున్న కార్లు.. ఎక్కువగా విదేశాల్లో తయారవైనవే. విదేశీ రోడ్ల కండిషన్స్‌కు తగ్గట్లుగా… కార్లను తయారు చేస్తారు. ఇక్కడ అమ్ముకోవడానికి భారత రోడ్ల కండిషన్లకు అనుగుణంగా తయారు చేసినట్లు చెబుతున్నారు. అలా చెప్పినా… కూడా.. బేసిక్ రీసెర్చ్ చేసి.. భారత రోడ్లను అధ్యయనం చేసి ఆమేరకు కార్ల నిర్మాణంలో వంద శాతం మార్పులు చేసినట్లుగా ఎక్కడా కనిపించదు. అందువల్ల ఏమవుతుందంటే.. హైస్పీడ్ వల్ల.. హైవేల్లో అయినా ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

రహదారి భద్రతను పట్టించుకోని ప్రజలు..!

హరికృష్ణ ప్రమాదం విషయంలో టెరిఫిక్ స్పీడ్.. అది కూడా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి డ్రైవింగ్ చేస్తున్నారు. అదే సమయంలో.. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. రోడ్ సేఫ్టీ నార్మ్స్‌ను పట్టించుకోలేదు. ఇప్పటికీ మన దేశం రహదారి భద్రతపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. సామాన్యులతో పాటు ప్రముఖ వ్యక్తులు కూడా పట్టించుకోవడం లేదు. కానీ ప్రముఖు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు అవి. కారులో కూర్చుంటే.. తప్పనిసరిగా.. ప్రపంచం మునిగినా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే.. సమాజంలో ప్రముఖ స్థానంలో ఉన్న వారే నిబంధనలు పట్టించుకోకపోతే.. సామాన్యులు ఎందుకు పట్టించుకుంటారు..?. చనిపోయాడు కాబట్టి.. ఇవన్నీ తప్పు అని చెప్పడం కాదు. దీన్నుంచి మనం నేర్చుకోవాలి.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ అందుబాటులో ఉండటం లేదు..!

మన దేశంలో అత్యవసరంగా రావాల్సిన మార్పు ఏమిటంటే… రహదారి భద్రత విషయంలో.. నిబంధనలు అతిక్రమించకుండా చేయడం. సిగ్నల్ జంప్ దగ్గర్నుంచి.. ఓవర్ స్పీడ్ వరకూ.. ఏ విషయంలోనూ.. రహదారి నిబంధనలు అతిక్రమించకుండా.. ప్రజల్లో మార్పు రావాలి. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా… వాటిపై అధికార వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక వేళ తీసుకున్నా.. ఏ చర్యలు తీసుకున్నా… ఎవరికీ తెలియడం లేదు. అలాగే… పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్. ప్రజారవాణా వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. 70 శాతం మంది సొంత వాహనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఇంత మొత్తం మంది ప్రజారవాణాను ఉపయోగిస్తే… ప్రజలు క్షేమకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతారు. కానీ దేశంలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో 40 శాతానికి మంచి ఎవరూ.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించడం లేదు. దీని వల్ల ఏమవుతుందంటే.. రోడ్‌ క్యారీయింగ్ కెపాసిటీని మించి వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. దీని వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి.

రోడ్ సేఫ్టీని ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి..!

మరో కారణం ఏమిటంటే.. ఎవరికి పడితే..వారికి ఇష్టం వచ్చినట్లుగా లైసెన్సులు ఇస్తున్నారు. డ్రంకన్ డ్రైవులు ఎన్ని జరిగినా.. కంట్రోల్ కావడం లేదు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు.. సడన్‌గా టిప్పర్లు వచ్చేస్తాయి. ట్రాక్టర్లు వచ్చేస్తాయి. వారిని ఎవరు నడుపుతారో ఎవరికీ అర్థం కాదు. ఓవర్‌లోడ్ తో లారీలు వెళ్తూ ఉంటాయి. హరికృష్ణ ప్రమాదాన్ని ఓ కేస్ స్టడీగా తీసుకుంటే.. రోడ్ సేఫ్టీలో ఉన్న లోపాలన్నీ బయటకు వస్తాయి. సుప్రీంకోర్టు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో కూడా.. రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్లు ప్రకటించాలని సూచించింది. ఈ యాక్షన్ ప్లాన్‌లను విస్తృతంగా ప్రచారం చేయాలి. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రయారిటీగా రోడ్ సేఫ్టీ ఉండాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే… నిబంధనలు ఉల్లంఘిచిన వారిని.. ఎప్పటికప్పుడు పట్టుకుని కరెక్ట్ చేయాలి.

రహదారి ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు అడ్డుకోవాలి..!

ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో … హైస్పీడ్‌లో వెళ్లకుండా ఉండాల్సింది అనడం కాదు. సూర్యాపేట దగ్గరే హైస్పీడ్‌లో కనిపిస్తే.. నకిరేకిల్ దగ్గరే ఆపగలిగే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ పట్టుకోలేకపోతే… నార్కట్ పల్లిలో అయినా ఆపలగలిగాలి. అలా ఆపి…చర్య తీసుకుంటే.. కంట్రోల్ చేయవచ్చు. కానీ… ప్రమాదం జరిగిన పోయిన తర్వాత బాధపడటం కన్నా.. ఇలా ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు.. అలాంటి వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రోడ్డు మీద.. అత్యాధునిక కెమెరాలను.. ఏర్పాటు చేసుకుని.. ఈ వ్యవస్థను మరింతగు ఆధునీకకరించుకోవచ్చు. దాంతో పాటు.. ఆన్ రోడ్ మెడికల్ ఫెసిలిటీ ఉండాలి. అమెరికా నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే.. అక్కడ రోడ్డుపై… ప్రమాదం జరిగితే.. క్షణాల్లో అంబులెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ రాదు. ప్రమాదం జరిగినప్పుడు.. వెంటనే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండగలగాలి. ఎంత త్వరగా వస్తే.. అంతగా మనిషిని కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఆన్ రోడ్ ఆంబులెన్స్ ఫెసిలిటీ కానీ.. ఎర్లీ అంబులెన్స్ ఫెసిలిటీ కానీ..మనకు ఎక్కడా కనబడదు.

రోడ్ సెఫ్టీ .. అనేది… మనం అప్పుడప్పుడు మాట్లాడుకోవడం తప్ప.. పూర్తి స్థాయిలో .. ప్రజల్లో అవగాహన పెంచి.. ప్రమాదాల నివారణకు.. ప్రభుత్వాల తరపున మౌలిక సదుపాయాలు పెంచాలనే ప్రయత్నాలు జరగడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com