ఆ ఐదుగురికీ ఆరో తేదీ వ‌ర‌కూ గృహ నిర్బంధం

బీమా కోరేగామ్ హింసాత్మ‌క ఘ‌ట‌న కేసుకు సంబంధించి మ‌హారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురునీ గృహ నిర్బంధంలో ఉంచాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. వ‌ర‌వ‌ర‌రావుతోపాటు గౌత‌మ్‌, సుధా భ‌ర‌ద్వాజ్‌, అరుణ్ ఫెరీరా, వెర్ర‌న్ గొంజాల్వేజ్ ల‌ను ఎవ‌రి ఇళ్ల‌లో వారిని గృహ నిర్బంధంలోనే వ‌చ్చే నెల‌ 6 వ‌ర‌కూ ఉంచాల‌నీ, జైల్లో నిర్బంధించాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ కేసుపై తదుప‌రి విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది. వీరిని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, కేంద్ర ప్ర‌భుత్వానికీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 5లోగా ఈ నోటీసుల‌పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతోపాటు, కేంద్రం కూడా స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ సంద‌ర్బంగా సుప్రీం కోర్టు జ‌డ్జి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సేఫ్టీ వాల్వ్ లేకుంటే ప్రెష‌ర్ కుక్క‌ర్ పేలిపోతుంద‌నీ, అలాగే ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న అనేది సేఫ్టీ వాల్వ్ లాంటిద‌నీ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ ఐదుగురిలో ఇద్ద‌రు ఇప్ప‌టికే గృహ నిర్బంధంలో ఉన్నారు. మిగిలిన‌వారిని కూడా అదే త‌ర‌హాలో వారి స్వ‌స్థ‌లాల‌కు త‌ల‌రించాల‌ని కోర్టు చెప్పింది. అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టులో వాద‌న‌లు వినిపిస్తూ… నిందితుల‌తో ప‌రిచ‌యం లేనివాళ్లు బెయిల్ పిటిష‌న్లు దాఖ‌లు చేశార‌నీ, ఇది ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కేసు అంటూ కోర్టులో వాదించారు.

దీంతో ఈ ఐదుగురికీ కొంత ఊర‌ట ల‌భించింద‌నే చెప్పొచ్చు. అయితే, గృహ నిర్బంధంలో ఉంచ‌డం వ‌ల్ల వీరు ఇంటి నాలుగు గోడ‌లు దాటి బ‌య‌ట‌కి వెళ్ల‌లేని ప‌రిస్థితి. కానీ, బ‌య‌ట‌కి వారు ఎవ‌రైనా ఇంట్లోకి వ‌చ్చి మాట్లాడే అవ‌కాశం ఉంటుంది. ఇంట్లో వారు స్వేచ్ఛ‌గా ఉండేందుకు కూడా పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఉండ‌వు. ఇక, ఈ కేసు విష‌య‌మై త‌మ ద‌గ్గ‌ర బ‌ల‌మైన సాక్షాధారాలున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు. కోర్టు ఇచ్చిన గ‌డువులోగా వాటిని పోలీసులు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మరి, మహారాష్ట్రతోపాటు కోర్టు ముందు కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close