ప్రొ.నాగేశ్వర్: శాకాహార ఉన్మాదం జడలు విప్పుతోందా..?

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా తెలివిగా శాకాహారం ఉద్యమాన్ని నడుపుతున్నారు. శాకాహారం ఆరోగ్యకరం..మాంసాహారం ప్రమాదం కరం అనే ప్రచారాన్ని చాలా ఉద్ధృతంగా జరుపుతున్నారు. దీనికి మత విశ్వాసాలు, సంప్రదాయాలను జోడిస్తున్నారు. కారణం ఏమిటంటే.. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. గుజరాత్ శాకాహారుల రాష్ట్రం. అక్కడ గుడ్లు కూడా ఓ నల్లటి బ్యాగ్‌లో ప్యాక్ చేసి అమ్ముతారు. గుజరాత్ మోడల్ని దేశం మొత్తం రుద్దాలి అంటే.. గుజరాత్ వెజిటేరియన్ అలవాట్లను కూడా దేశం మొత్తం రుద్దాలి అనే ప్రయత్నం జరుగుతోంది.

మధ్యాహ్న భోజనంలో గుడ్లు నిలిపివేసిన బీజేపీ రాష్ట్రాలు..!

దేశంపై శాకాహారాన్ని రుద్దాలి అనే ప్రయత్నం అనేక రూపాల్లో కనిపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకం గుడ్ల పంపిణీని నిషేధించాయి. మధ్యాహ్న భోజనం గుడ్డు ఉంటే హిందూమత విశ్వాసాల్ని దెబ్బ తీస్తుందనే కారణం చెబుతున్నారు. హిందువుల్లో కూడా 70 శాతం మంది మంసాహారులే. వీరందరి విశ్వాసాలు దెబ్బతింటాయేమో తెలియదు. ఇక్కడ గుర్తించదగిన విశేషం ఏమిటంటే.. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. ఇది ఐఐటీ ఢిల్లీ వాళ్లు జరిపిన సర్వేలో వెల్లడయిన విషయం. అంటే పౌష్టికాహారలోపంతో అత్యధికంగా బాధపడుతున్న పిల్లలు రాష్ట్రంలో… పేద పిల్లలకు.. ప్రభుత్వ స్కూళ్లలో గుడ్లు అందకుండా నిషేధం విధించారు.

ఎయిరిండియాలో మాంసాహారాన్ని పంపిణి చేయరట..!

ఇక ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ఎకానమీ క్లాస్‌లో మాంసాహారం ఇవ్వబోమని ప్రకటించారు. ఇలా ఎందుకు చేశారని అడిగిన వారికి ఎయిరిండియా చీఫ్ చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చారు. వేస్టేజీ తగ్గించడానికి , కేటరింగ్ కాస్ట్ తగ్గించడానికి , శాకాహారా, మంసాహారాలు కలిసిపోతున్నాయన్న కారణాలు చెప్పారు. ఈ కారణాల్లో ఒక్క దానికి అర్థం లేదు. వెజ్, నాజ్ వెజ్ ఎప్పుడూ ప్రత్యేక బాక్సుల్లోనే ప్యాక్ చేస్తారు. ఒక వేళ కలపకపోయినా.. ఇక ముందు ఆ ప్రయత్నం చేయవచ్చు. ఇక కాస్ట్ కటింగ్ అనేది మరో అర్థం లేని కారణం… అదేమీ.. ఎయిరిండియా ఉద్యోగులకు పంపిణీ చేయడం లేదు. ఖరీదు కట్టి.. ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తారు. ఇక వేస్టేజీ కారణం కూడా అలాంటిదే.. వేస్టేజీ చేసేవాళ్లలో వెజిరియన్స్ కూడా ఉంటారు. శాకాహార ఉన్మాదాన్ని దేశంపైకి రుద్దడానికి వేసిన ఎత్తుగడ ఇది.

దక్షిణ ఢిల్లీలో మాంసాహారాన్ని ప్రదర్శించడం నేరం..!

దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంది. అ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా… మాంసాహార వంటకాలను ప్రదర్శనకు పెట్టకూడదని ఆ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగంగా వండకూడదు అని స్పష్టం చేశారు. దీనికి కారణం ఏమి చెప్పారంటే.. శాకాహారుల సెంటిమెంట్లు దెబ్బతింటాయని చెప్పుకొచ్చారు. అలాగే.. ఆరోగ్యకరమైన ఆహారం అందించడమని చెప్పుకొచ్చారు. అంటే.. కలుషితం కాకుండా చూడటానికట. దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ చెప్పేది ఎలా ఉందంటే.. ఈగలు, దోమలు, దుమ్ము, ధూళి అన్ని…నాన్ వెజ్‌ మీదే వాలతాయన్నట్లుగా చెప్పుకొచ్చారు. అసలు ఈ వాదనలో అర్థం ఉందా..? ఇక రైల్వే బోర్డు కూడా ఇటీవల.. ఇలాగే ఓ శాకాహార ప్రతిపాదన చేసింది. తీవ్రమైన నిరసన రావడంతో తాత్కాలికంగా విత్ డ్రా చేసుకుంది.

మెడిసిన్స్‌లోనూ శాకాహార మందులట..!

జిలెటిన్ క్యాప్యూల్ అని ఓ మెడిసన్ ఉంది. వెయిట్ లాస్, ఎములకు సంబంధించిన కొన్ని వ్యాధులకు ఇది కీలమకైన మందు. ఈ క్యాప్సూల్‌కి పైన ఉండే పొరను జంతువుల ఎముకల నుంచి తయారు చేస్తారు. అనేక విధాలుగా ప్రాసెస్ చేసి.. దీన్ని తయారు చేస్తారు. అయినా సరే.. ఈ టాబ్లెట్ .. నాన్ వెజ్ టాబ్లాట్ గా పేర్కొంటూ… వైద్యోఆరోగ్యశాఖ ఓ ఆదేశం జారీ చేసింది. ఈ మందులు.. మంసాహార మందులుగా ఉన్నాయి…వీటికి బదులుగా శాకాహార మందులు తయారు చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఓ కమిటీ కూడా వేసింది. దీనికి కూడా… వారు చెప్పిన కారణం.. శాకాహారుల సెంటిమెంట్ దెబ్బతింటోందని చెబుతున్నారు. ట్యాబ్లెట్లు వేసుకునేవారితో బలవంతంగా మంసాహారం తినిపించడమే కదా అని చెబుతున్నారు. కానీ ఇదొక్కటే కాదు.. చాలా ట్యాబ్లెట్స్ లో క్యాప్సూల్స్ లో… టానిక్కుల్లో మంసాహార పదార్థాలు వాడతారు కదా. మరి ఆ మందులను కూడా బ్యాన్ చేస్తారా..?. వైద్యఆరోగ్యశాఖ చేస్తున్న ప్రయత్నాల వల్ల మందుల ధర పెరగడానికి కారణం అవుతోంది. పైగా మన దేశంలో.. శాకాహా క్యాప్సూల్ కవర్లను తయారు చేసే సామర్థ్యం లేదు. చైనా నుంచే దిగుమతి చేసుకోవాలి. అంటే చైనా మీద మనం మరింతగా ఆధారపడాలి. మాకు వెజిటెరియన్ క్యాప్సూల్సే కావాలని ఎవరైనా అడిగారా..?

శాకాహారం తింటేనే ఆరోగ్యవంతులని ప్రచారం..!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం… స్వాస్థ భారత్, ఆయుష్మాన్ భవ అనే రెండు పథకాలను ప్రారంభించింది. వీటి ప్రచారం కోసం ఓ ట్వీట్ చేసింది. దాంట్లో ఏముందంటే..సన్నటి మహిళ వెజ్ తింటున్నట్లుగా… లావుటి మహిళ నాన్ వెజ్ తింటున్నట్లు చెప్పుకొచ్చారు. లీడ్ ఏ హెల్తీ లైఫ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. అంటే… కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా చెబుతున్నదేమిటంటే… వెజ్ తింటే ఆరోగ్యం.. నాన్ వెజ్ తింటే అనారోగ్యం అని అర్థం. కానీ దీన్ని ఎక్కడైనా సైంటిఫిక్ రీసెర్చ్ రుజువు చేసిందా..? మానవ జనాభాలో అత్యధికులు మాంసాహారులే. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వహించే.. ఫ్యామిలీ హెల్త్ సర్వేల్లాంటి వాటిలో… భారతదేశంలో ఇరవై శాతం మంది కూడా.. శాకాహారులు లేరని బయటపడింది. 80 శాతం మంది మాంసాహాలురున్నారు. వీరిలో 15 శాతం బీఫ్ తింటున్నారు. బీఫ్ తినేవారిపై ఎలా దాడులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము.

ప్రజల మధ్య విభజనకు ఆహారపుటలవాట్ల పేరుతో ప్రయత్నం..!

ఈ శాహాహార ఉన్మాదానికి కారణం ఏమిటి..? మన దేశంలో ఆహారపు అలవాట్లు కుల, మతాలతో ముడిపడి ఉంటాయి. ముస్లిం, క్రిస్టియన్స్‌లలో అత్యధికులు నాన్ వెజిటేరియన్లు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు డివైడ్ తీసుకురావడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. హిందువుల్లో కూడా మెజార్టీ మాంసాహారులే. ఒకటి, రెండు అగ్రకులాలు మాత్రమే అధికారికంగా మాంసం తినరు. వీరిలోనూ.. చాలా మంది అనధికారికంగా… మంసాహారం తింటున్నారు. అంటే. ఇందులో కుల, మత దురహంకారం లేదా..? అసలు ఏది వెజ్…? ఏది నాన్ వెజ్ అనే వివాదం కూడా ఉంది. చాలా మంది గుడ్ల తినేవాళ్లు మేము మాంసం తినము అంటారు. అలాగే కొంత మంది ఫిష్ తింటారు. బెంగాల్ వాళ్లకి అది వెజిటేరియన్ పుడ్డే. ఇలా చాలా ఉన్నాయి. కానీ ప్రజల మీద మాత్రం…ఆహారపుటలవాట్లు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.