ఏపీలో రియల్ ఎస్టేట్ ఊపు మీద ఉండటంతో క్రెడాయ్ .. ప్రాపర్టీ షోలు విరివిగా ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 19 నుంచి 21 విశాఖలో క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్ పో జరగనుంది. జనవరిలో విజయవాడలో నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద కార్యక్రమంగా పేరొందిన క్రెడాయి (CREDAI) ప్రాపర్టీ షో–2026కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఆహ్వానించారు. జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో ఈ ఎక్స్ పో జరుగుతుంది. ఎక్స్పో ద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్రెడాయ్ తెలిపింది. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంటున్న సమయంలో ఈ షో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు.
విజయవాడలో జరగనున్న ఈ ప్రాపర్టీ షోలో రాష్ట్రవ్యాప్తంగా 100కి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు పాల్గొననున్నారు. విల్లాలు, అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలు వంటి వివిధ రకాల ప్రాపర్టీలు ప్రదర్శించబడతాయి. హోమ్ బయ్యర్స్, ఇన్వెస్టర్లకు ఒకేచోట అన్ని ఆప్షన్లు చూసి ఎంచుకునే అవకాశం కల్పిస్తారు.
