[X] Close
[X] Close
క‌మ‌ర్షియాలిటీ నేర్చుకున్న క్రిష్‌

గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌, కంచె.. ఇలా క్రిష్ ఏ సినిమా క‌థ ఎంచుకున్నా, అందులో ఓ సామాజిక కోణం ఉంటుంది. స‌మాజానికి ఏదో చెప్పాల‌న్న త‌ప‌న క‌నిపిస్తుంది. ఇప్పుడున్న ద‌ర్శ‌కుల‌లో క్రిష్‌ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది అదే. అయితే క్రిష్ క‌మ‌ర్షియాలిటీని మ‌ర్చిపోయాడ‌ని, త‌న‌కు వాణిజ్య విలువ‌ల‌తో సినిమా తీయ‌డం చేత‌కాలేద‌న్న విమ‌ర్శ‌లూ వినిపించాయి. అది నిజం కూడా. క్రిష్ ఎప్పుడూ ఓ క‌మ‌ర్షియ‌ల్ కోణంలో క‌థ‌ని ఆలోచించ‌లేక‌పోయాడు. అందుకే క్రిష్ సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర భారీ విజ‌యాల్ని న‌మోదు చేయ‌లేక‌పోయాయి. అవార్డు సినిమాలు ఇచ్చినా, ఆర్థిక‌ప‌ర‌మైన సంతృప్తి మాత్రం ద‌క్క‌లేదు.

అయితే ఈసారి క్రిష్ త‌న పంథా పూర్తిగా మార్చేశాడు. ప‌వ‌న్ సినిమా కోసం. ప‌వ‌న్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. వీరిద్ద‌రి కాంబోలో సినిమా అన‌గానే.. ఈసారి కూడా సామాజిక ఇతివృత్తంతోనే, క్రిష్ పంథాలోనే సినిమా రాబోతోంద‌ని అనుకున్నారు. అయితే ఈసారి క్రిష్ త‌న పంథా మార్చేశాడు. ప‌వ‌న్‌తో సినిమా పూర్తి క‌మ‌ర్షియ‌ల్ కోణంలో సాగ‌బోతోంది. ఇందులో స్పీచులు లేవు. సామాజిక అంశాలు లేవు. ఓ మాస్ హీరోని ఎలాంటి క‌థ‌లో చూపించాల‌ని ద‌ర్శ‌కులు అనుకుంటారో, ఎలాంటి పాత్ర‌లో చూడాల‌ని అభిమానులు ఆశిస్తారో, స‌రిగ్గా అలాంటి పాత్ర‌లో, అలాంటి క‌థ‌లో క్రిష్ ప‌వ‌న్‌ని చూపించ‌బోతున్నాడు. ప్ర‌తీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలోనూ.. మాస్‌ని మెప్పించేందుకు క‌నీసం నాలుగైదు ఎపిసోడ్లు ఉంటాయి. అలాంటి ఎపిసోడ్ల‌ని అడుగ‌డుగునా ప్లాన్ చేశాడ‌ట క్రిష్‌. ప‌వ‌న్‌లో హీరోయిజం.. ఈ సినిమాలో మ‌రో రూపంలో క‌నిపించ‌బోతోంద‌ని, క్రిష్ ఓ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ని ఎలా టేక‌ప్‌చేయ‌గ‌ల‌డో ఈ సినిమా ద్వారా అర్థం కానున్న‌ద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క్రిష్‌పై హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం ఎక్కువ‌. వాటి ల‌క్ష‌ణాలు, క్వాలిటీ, ప్ర‌జెంటేష‌న్ ఈ సినిమాలో చూసే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

కోమటి జయరాం కి మాతృ వియోగం, పలువురి సంతాపం

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, కోమటి జయరాం తల్లి కోమటి కమలమ్మ ఏప్రిల్ 9, గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15లకు కన్నుమూశారు....

పేదలకు ప్యాకేజీ ప్రకటించాలని టీడీపీ డిమాండ్..!

పేదలందరికి కుటుంబానికి రూ. ఐదు వేలు చొప్పున పంపిణీ చేయాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు చేసినా పట్టించుకోవడం లేదని మండి పడింది.రాష్ట్రంలో ప్రస్తుత...

లారెన్స్ విరాళం 3 కోట్లు

డాన్సర్ గా, నటుడిగా, దర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నాడు లారెన్స్‌. ప్ర‌జా సేవ‌లోనూ ముందుంటాడు. ఓ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్థాపించి విక‌లాంగుల‌కు స‌హాయం చేస్తున్నాడు. ఇప్పుడు కరోనాపై పోరాటంలో త‌న...

పేద దేశంగా మారబోతున్న ఇండియా..!?

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా కొట్టే దెబ్బ.. నేరుగా పేద , మధ్య తరగతి వర్గాలపై పడబోతోంది. దేశంలో దాదాపుగా 40 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోతారని.. ప్రపంచ కార్మిక సంస్థ...

HOT NEWS