“ఎన్‌కౌంటర్ శిక్ష”ల డిమాండ్లతో ఉద్యమాలు..!

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ దేశంలో కొత్త తరహా ఉద్యమాలకు కారణం అవుతోంది. రేప్ కేసులు నమోదైన చోటల్లా.. నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఎక్కడిక్కడ ఊపందుకుంటున్నాయి. తెలంగాణలో కూడా… మరో ఎన్ కౌంటర్ డిమాండ్‌తో.. ప్రజలు రోడ్లెక్కారు. ఆదిలాబాద్ జిల్లాలో… టేకు లక్ష్మి దళిత మహిళను.. కొంత మంది యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. దిశ ఘటన జరిగినప్పుడే ఇది కూడా జరిగింది. కానీ మీడియాలో హైలెట్ కాలేదు. వారు అత్యంత నిరుపేదలు కావడం… మరుమూల గ్రామంలో జరగడంతో.. ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ఎప్పుడైతే.. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారో.. అప్పుడే.. సోషల్ మీడియాలో ఉద్యమం ప్రారంభమయింది. దళిత మహిళ అనే కారణంగానే న్యాయం చేయడంలో నిరాదరణ చూపిస్తున్నారా.. అంటూ… ప్రజలు రోడ్డెక్కారు. నిన్న బంద్ కూడా నిర్వహించారు. రాజకీయ నేతల పరామర్శలు కూడా.. టేకు లక్ష్మి కుటుంబానికి ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో మాత్రమే కాదు.. దేశంలో ఇతర చోట్ల కూడా.. అవే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సినీ నటి ప్రత్యూష తల్లి, వైఎస్ హయాంలో దారుణహత్యకు గురైన ఆయేషా మీరా తల్లి లాంటి వారు తెరపైకి వచ్చారు. తమ కూతుళ్లపై దారుణాలకు పాల్పడిన వారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరో ఘటన.. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి సజీవ దహనం. వారిని కూడా.. ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. రేప్ కేసుల్లో ఉన్న నిందితులందర్నీ.. అలాగే శిక్షించాలని… చటాన్ పల్లి ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అందరికీ అదే న్యాయం అమలు చేయాలంటున్నారు.

ప్రజలు భావోద్వేగంలో ఉన్నారు. వారు చంపేయాలని డిమాండ్ చేశారు. చంపేయలేకపోతే.. తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గారో… ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలనుకున్నారో.. వారి భావోద్వేగాలకు తగ్గట్లుగా వ్యవహించి.. ప్రశంసలు పొందాలనుకున్నారో కానీ.. ఎన్‌కౌంటర్ చేసేశారు. నిందితులు తిరుగుబాటు చేయడం వల్ల.. ఆ ఎన్‌కౌంటర్ జరిగిందని..ఒక్కరంటే ఒక్కరూ నమ్మడం లేదు. కావాలనే చేశారని.. అందరూ అంటున్నారు. ఇప్పుడా భావోద్వేగం అన్ని రేప్ కేసుల్లోనూ కనిపిస్తోంది. విచారణలాంటివేమీ లేకుండా… ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ఇదే చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

HOT NEWS

[X] Close
[X] Close