తీర్పు : పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదు..!

పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉంటే నేరమా..?. కానే కాదని తీర్పు చెప్పింది.. మద్రాస్ హైకోర్టు. అసలు అలా ఉండకూడదని.. ఏ చట్టంలో లేదని.. హైకోర్టు ప్రత్యేకంగా గుర్తు చేసింది. మేజర్లయిన ఇద్దరు… సహజీవనం చేస్తూంటే.. నేరంగా ఎలా పరిగణించలేమో… అవివాహితులయిన ఇద్దరు స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉన్నా.. నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు అక్కడ ఓ రూమ్‌లో ఉన్న ఓ యువతి, యువకుడ్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. వారిద్దరికి పెళ్లి కాలేదని.. కలసి ఉన్నారని కేసు బుక్ చేశారు. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై.. న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.

దేశంలో ఎక్కడైనా.. పెళ్లి జంట.. రూమ్ తీసుకుంటుందంటే.. హోటళ్లలో కానీ.. ఇతర చోట్ల కానీ.. అనుమానపు చూపులు వారిపై మళ్లుతూంటాయి. అదేదో వ్యభిచారం కేసులన్నట్లుగా చూస్తూంటారు. సాధారణ జనం.. చూపులకే పరిమితమవుతారు కానీ.. పోలీసులు మాత్రం.. కచ్చితంగా వ్యభిచారం కేసులుగానే భావిస్తూంటారు. హఠాత్తుగా.. హోటళ్లపై రెయిడ్స్ చేసి.. పెళ్లి కాని జంటలయితే.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసులు బుక్ చేస్తారు. లేదంటే డబ్బులు వసూలు చేసి వదిలి పెడతారు. మేజర్లయిన వారు.. ఇష్టప్రకారం.. కలిసి ఉండటం తప్పు కాదని.. లివింగ్ టు గెదర్ వారిష్టమని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ.. పోలీసులు కేసులు నమోదు చేయడం ఆపలేదు. దానికి వారు వ్యభిచార నిరోధక చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు.

సమాజంలో వేగంగా మార్పులొస్తున్నాయి. ఆ మార్పుల్ని ఆహ్వానించడానికి న్యాయస్థానాలు.. సిద్ధంగా ఉన్నాయి కానీ… పోలీసులు మాత్రం.. మోరల్ పోలీసింగ్ చేసేందుకు వెనుకాడటం లేదు. కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో.. రెండు జంటలను.. పోలీసులు పట్టుకున్నారు. ఓ జంటలోని భార్య…మరో వ్యక్తితో ఉండటంతో.. భర్తనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడ ఆ వ్యక్తి భార్య తన ఇష్టప్రకారమే…మరో వ్యక్తితో గడుపుతోంది…కాబట్టి పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. ఆ ఇంట్లోనే ఉన్న మరో జంట… తమ ఇష్టప్రకారం గడిపితే.. మీకేం నష్టం… ఏ చట్టం ప్రకారం.. మీరు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎదురుతిరగడంతో.. పోలీసులు ఏమీ చెప్పలేక వెళ్లిపోయారు. కానీ ఆ చైతన్యం అందరికీ ఉండటం లేదు. ఈ తరుణంలో మద్రాస్ హైకోర్టు తీర్పు.. మరింత క్లారిటీ ఇస్తోందని యువతరం అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

HOT NEWS

[X] Close
[X] Close