రూల‌ర్‌ ట్రైల‌ర్ : గ‌బ్బ‌ర్ సింగ్, మ‌హ‌ర్షి.. రెండూ క‌లిపేశారా?

గ‌బ్బ‌ర్ సింగ్‌నీ మ‌హ‌ర్షినీ క‌లిపేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే బాల‌య్య కొత్త సినిమా `రూల‌ర్‌` చూడాల‌నిపిస్తుంది. ఎందుకంటే రూల‌ర్‌ ట్రైల‌ర్ ఈరోజే విడుద‌లైంది. ఆ ట్రైల‌ర్‌లో కంటెంట్ చూస్తుంటే ఇటు ప‌క్క గ‌బ్బ‌ర్ సింగ్ అటు ప‌క్క మ‌హ‌ర్షి గుర్తుకు వ‌స్తాయి. ఈ సినిమాలో బాల‌య్య కొన్ని ఫ్రేముల్లో పోలీసుగా, ఇంకొన్ని చోట్ల రైతుగా, మ‌రికొన్ని చోట్ల స్టైలీష్ బిజినెస్‌మెన్‌గా క‌నిపిస్తున్నాడు. ట్రైల‌ర్లో రైతుల గురించిన డైలాగూ ఉంది. రైతుల స‌మ‌స్య‌ని `మ‌హ‌ర్షి`లో బాగా ఎలివేట్ చేశారు. అందులో మ‌హేష్ కూడా ఓ బిజినెస్‌మేనే. ఇక పోలీస్ సినిమాలంటే గ‌బ్బ‌ర్ సింగ్ గుర్తొస్తుంది. రౌడీ పోలీసుగా బాల‌య్య చాలా సినిమాల్లో చేశాడు. అందులో ఇదొక‌టి. ట్రైల‌ర్‌లో మాస్ అంశాలు పుష్క‌లంగా ఉన్నాయి. యాక్ష‌న్‌ని ఓ లెవిల్లో చూపించారు. త‌న‌కు అల‌వాటైన `సింహం` డైలాగు కూడా జొప్పించారు. ట్రైల‌ర్‌లో ఎందుక‌నో క్లారిటీ మిస్ అయిన‌ట్టు క‌నిపిస్తుంది. డైలాగుల్లోనూ ప‌స‌లేదు. హ‌డావుడిగా క‌ట్ చేసిన‌ట్టు అనిపిస్తుంది. ఓ త‌మిళ డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్. బాల‌య్య సినిమా ట్రైల‌ర్లో చివ‌ర్లో ఓ ప‌వ‌ర్‌ఫుల్ పంచ్ ఉంటుంది. అది మిస్ అయిన‌ట్టు అనిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.