ప్లానింగులేని కార్తికేయ కెరీర్‌

ఆర్‌.ఎక్స్ 100తో ఓ కెర‌టంలా వ‌చ్చిప‌డ్డాడు కార్తికేయ‌. ఆ సినిమా చూశాక‌… చిన్న, ఓ మోస్త‌రు నిర్మాత‌లూ, ద‌ర్శ‌కులు త‌మ‌కు ఓ మంచి ఆప్ష‌న్ దొరికింద‌నుకున్నారు. కానీ – ఇప్పుడు ఆ కార్తికేయే వ‌న్ సినిమా వండ‌ర్‌లా త‌యార‌వుతున్నాడ‌నిపిస్తోంది. హిప్పీ, గుణ 369 సినిమాలు వ‌రుస‌గా ప‌ల్టీలుకొట్టాయి. ఇప్పుడు `90 ఎం.ఎల్‌` ప‌రిస్థితీ అలానే త‌యారైంది.

కుర్రాడిలో ఎన‌ర్జీ ఉంది. కానీ దాన్ని స‌రైన తీరితో వాడుకోవ‌డం లేద‌నిపిస్తోంది. క‌థ‌ల ఎంపిక‌లో చాలా త‌ప్పులు చేస్తున్నాడు. అయితే ఈ త‌ప్పంతా త‌న‌దే అన‌డానికి వీల్లేదు. కార్తికేయ క‌థ‌లు వినే బాధ్య‌త‌ని త‌న బాబాయ్‌కి అప్ప‌గించాడు. బాబాయ్ `ఎస్‌` అంటే `ఎస్‌…`… `నో` అంటే `నో`. హిప్పీ, గుణ‌, ఎం.ఎల్ ఈ క‌థ‌ల‌న్నీ బాబాయ్ ఓకే చేసివవే. మాస్ హీరోగా అర్జెంటుగా ఎదిగిపోవాల‌న్న తాప‌త్ర‌యంలో ఉన్నాడు కార్తికేయ‌. అదే త‌న కెరీర్‌కి ప్ర‌ధాన‌మైన ఇబ్బంది. త‌న వ‌య‌సున్న హీరోలు ఎలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నారు? త‌న‌కు ఎలాంటి క‌థ‌లు న‌ప్పుతాయి? అనే విష‌యంలో కార్తికేయ‌కు స్ప‌ష్ట‌త లేకుండా పోయింది. డాన్సులు, ఫైటింగులు, మాస్ సీన్లు.. ఇవే హీరోయిజం అనుకుంటున్నాడు. ఈ భ్ర‌మ‌ల్లోంచి బ‌య‌ట‌కు రావాలి. అప్పుడు త‌ప్ప మంచి క‌థ‌లు త‌న చేతికి రావు. బాబాయ్‌కో, మేనేజ‌ర్ కో క‌థ‌లు వినే బాధ్య‌త అప్ప‌గించ‌డం కాకుండా, త‌నే క‌థ‌లు విని – అస‌లు ఎలాంటి క‌థ‌లు త‌న‌ని వెదుక్కుంటూ వ‌స్తున్నాయో తెలుసుకోవాలి. ముందు కాస్త బ్రేక్ తీసుకుని, త‌ప్పులెక్క‌డ జ‌రిగాయో తెలుసుకోవాలి. త‌న‌కు బోలెడంత కెరీర్ ఉంది. ఇప్ప‌టికీ కార్తికేయ‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు రెడీగా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోకుండా ఆచి తూచి ఆలోచించి అడుగేయాలి. మ‌రో ఫ్లాపు ప‌డిందంటే – అదే ఆఖ‌రి మ‌జిలీ అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

HOT NEWS

[X] Close
[X] Close