దేశంలో రోజూ 90 రేప్‌లు…ఇదీ సర్కారువారి లెక్క…!

కొన్నాళ్లుగా జనమంతా అత్యాచారాల గురించే మాట్లాడుకుంటున్నారు. పొద్దున్నే లేవగానే అత్యాచారాల గురించి మాట్లాడుకునే, సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, పత్రికల్లో రేప్‌ల గురించి చర్చించుకునే పరిస్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టమే. కాని తప్పడంలేదు. దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు రాజధానిగా మారిందని కాంగ్రెసు నాయకుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. కాని ఢిల్లీయే కాదు, దేశమే అత్యాచారాలకు రాజధానిగా మారిందని చెప్పుకోవచ్చు. భారత్‌ను గురించి ఎవరైనా మాట్లాడుకుంటే ఇది అత్యాచారాలకు నిలయమని, ఇక్కడ చిన్నపిల్లలు సహా మహిళలకు రక్షణ లేదని తప్పనిసరిగా మాట్లాడుకుంటారు. చట్టాలు, కోర్టుల ద్వారా బాధితులకు న్యాయం జరగదని, నేరగాళ్లకు శిక్షలు పడవని జనం గట్టిగా అభిప్రాయపడుతున్నారు.

నేరగాళ్లను తమకైనా అప్పగించాలని లేదా ఎన్‌కౌంటర్‌ చేసో, మరోవిధంగానో చంపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత ఈ డిమాండ్‌ ఊపందుకుంది. సామాన్యులే కాదు, అత్యున్నత అవార్డులు అందుకున్నవారు, వివిధ రంగాల్లో ప్రముఖులు సైతం ఇదే డిమాండ్‌ చేస్తున్నారంటే న్యాయవ్యవస్థ మీదనే నమ్మకం పోతోందని అనుకోవాలి. ఇదిలావుంటే దేశంలో రోజుకు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కేవలం అత్యాచారం చేసి ఊరుకోవడంలేదు. ఆ తరువాత చంపేస్తున్నారు. నెలల పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు దారుణమైన అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారు.

ప్రతి పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని ఈమధ్య టీవీ చర్చలో ఒకాయన చెప్పాడు. ఏ గణాంకాలైనా నూటికి నూరు శాతం కరెక్టుగా ఉండవు. దేశంలో రోజుకు 90 అత్యాచారాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది. ఇవి ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారం కట్టిన లెక్క. కాని వివిధ కారణాలతో పోలీసు స్టేషన్లలో నమోదుకాని అత్యాచారాలు ఎన్నో ఉంటాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2017లో 32,500 అత్యాచారాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 18,300 కేసుల్లో మాత్రమే కోర్టు తీర్పులు వచ్చాయి. తీర్పులు వచ్చినప్పటికీ ఎన్ని కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయో లెక్కలు లేవు.

అదే ఏడాదిలో 1,27,800 కేసులు (పాత కేసులు కలుపుకొని) పెండింగులో ఉన్నాయి. 2018, 2019 లెక్కలు ఏమిటో తెలియరాలేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ ఘటన గురించి తెలిసే ఉంటుంది. ఈ ఘటనలో బాధితురాలిని జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మరి కొందరితో కలిసి హత్య చేశాడు. బాధితురాలిని నిలువునా మంటల్లో తగులబెట్టేశాడు. తాజాగా కాంగ్రెసు నాయకురాలు ప్రియాంక గాంధీ ఉన్నవ్‌లో పర్యటించినప్పుడు ఉన్నావ్‌ జిల్లాలో గత 11 నెలల్లో 90 అత్యాచారాలు జరిగాయని చెప్పారు. దీంతో జిల్లా ఎస్‌పి విక్రాంత్‌ వీర్‌కు కోపమొచ్చింది.

ప్రియాంక గాంధీ చెబుతున్న లెక్క తప్పంటూ ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి నవంబరు 30 వరకు 51 అత్యాచారం కేసులు నమోదయ్యాయని చెప్పాడు. 2018లో 64 కేసులు నమోదయ్యాయని, 2017లో 54, 2016లో 37,2015లో 39 కేసులు నమోదైనట్లు చెప్పాడు. ఈ కేసులన్నీ పోలీసు స్టేషన్లలో నమోదైనవి. జరిగినవి ఎన్ని? అవి పోలీసుల లెక్కకు అందవు. కొన్ని అత్యాచారం కేసుల్లో రాజకీయ నాయకులే ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

HOT NEWS

[X] Close
[X] Close