అవినీతి చేశాడని మంత్రిని పీకేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం !

ఎమ్మెల్సీ లాంటి వాళ్లు నేరుగా మర్డర్లు చేశామని అంగీకరిస్తే ఎలాగోలా బయటపడేద్దామని ఆలోచిస్తున్న ప్రభుత్వాలు… హంతకుడని తెలిసినా ఎమ్మెల్సీ గారు అంటూ ఎస్పీ స్థాయి వ్యక్తులే గౌరవిస్తూ.. వ్యవస్థను అపహాస్యం చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి వార్త కాస్త విచిత్రమే. స్వయంగా తన కేబినెట్‌లోని మంత్రిని అరెస్ట్ చేయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. పంజాబ్ ఆప్ ప్రభుత్వంలో విజయ్ సింగ్లా ఆరోగ్య మంత్రి .

ఆయన వైద్య ఆరోగ్య శాఖలో ప్రతీ కాంట్రాక్ట్ విషయంలో తనకు ఒక్క శాతం లంచంగా ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేస్తున్నట్లుగా తేలిందని భగవంత్ మాన్ ప్రకటించారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు ఆయనపై వెంటనే.. ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించారు. రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతి జరిగినా సహించేది లేదని ఆయన ప్రకటించారు.

ప్రజలు ఎన్నో అంచనాల మధ్య ఆమ్​ఆద్మీ పార్టీకి అధికారం అప్పగించారని .. అవినీతిని పారదోలేందుకు కృషి చేస్తామని భగవంత్ మాన్ ప్రకటించారు. మంత్రిని అప్పటికప్పుడు పదవి నుంచి తొలగించి.. అరెస్ట్ చేయించడం రాజకీయవర్గాల్లోనూ సహజంగానే సంచలనమయింది. దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. గతంలో తెలంగాణలో రాజయ్యను అవినీతి ఆరోపణలతో తొలగించారు కానీ కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం వంటివి చేయలేదు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close