ప్రత్యేక హోదాపై పురందేశ్వరి వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాకి తీరని అప్రదిష్ట కలిగిస్తున్న అంశాలలో ప్రత్యేక హోదా ఒకటి. దానిపై ఆ పార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్-చార్జ్ డి.పురందేశ్వరి ఇటీవల ఒక టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చేరు.

ప్రశ్న: రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రప్రభుత్వానికి అసలు ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా?

పురందేశ్వరి జవాబు: రాష్ట్ర విభజనకు ముందు నేను మరికొంత మంది కాంగ్రెస్ ఎంపిలతో కలిసి రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న జైరామ్ రమేష్ ని ప్రత్యేక హోదా గురించి నిలదీశాము. ఆయన అది సాధ్యం కాదన్నట్లుగా చెప్పారు. ఆ తరువాత మేము దీని గురించి సోనియా, రాహుల్ గాంధీలను కూడా కలిసాము. వారు కూడా నిర్దిష్టంగా ఎటువంటి హామీ ఇవ్వలేదు.

ఆ తరువాత మేము వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలను కలిసాము. వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు లేవని, రాష్ట్ర విభజన తరువాత పరిశ్రమలు రాకపోతే రాష్ట్రం పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందని చెప్పాము. అలాగే దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే తప్పనిసరిగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించవలసి ఉంటుందని గట్టిగా చెప్పాము. అందుకే వారిరువురూ వాటి గురించి రాజ్యసభలో గట్టిగా పట్టుబట్టారు.

వారి ఒత్తిడి కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ చేత పార్లమెంటులో నోటిమాటగా హామీ ఇప్పించారు. అంటే కాంగ్రెస్ అధిష్టానానికి ఆ విషయంలో చిత్తశుద్ధి లేదని నాకు అర్ధమయింది. అప్పుడు వెంటనే నా కేంద్రమంత్రి పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసేసాను,” అని చెప్పారు.

ఆ తరువాత మా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్లానింగ్ కమీషన్ న్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసారు. దానిలో దేశంలోని ముఖ్యమంత్రులు అందరూ సభ్యులుగా ఉంటారు. వారందరూ ఆమోదిస్తే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు. అయినా ప్రత్యేక హోదా ప్రతిపాదనను 14వ ఆర్ధిక కమీషన్ పరిశీలనకు పంపించాము.

‘ప్రత్యేక హోదా’ అనే పేరుతో కాకపోయినా వేరే విధంగా అంతకంటే చాలా రెట్లు ఎక్కువగా రాష్ట్రానికి అన్నివిధాల కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోంది. ఇంత వరకు సుమారు రూ.1.40 లక్షల కోట్ల విలువ గల అభివృద్ధి, సంక్షేమ, పధకాలు, కార్యక్రమాలు రాశ్ర్తానికి మంజూరు అయ్యేయి. గత ఆరేడు దశాబ్దాలలో ఎన్నడూ ఒకేసారి 11 ఉన్నత విద్యాసంస్థలు ఒక రాష్ట్రానికి మంజూరు చేయబడలేదు. కానీ ఏడాదిన్నర వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 ఉన్నత విద్యాసంస్థలు మంజూరు అయ్యేయి. అవి కాక రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు, రూ. 60, 000 కోట్లతో రోడ్ల నిర్మాణం, బెల్, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ వంటి భారీ సంస్థల ఏర్పాటు చేయడం తదితర అనేక పనులన్నీ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. వాటన్నిటికీ కేంద్రప్రభుత్వమే నిధులు విడుదల చేస్తోంది. ప్రత్యేక హోదా అనే పదం మేము వాడలేకపోయినా అంతకంటే చాలా ఎక్కువే చేస్తున్నాము.

కేంద్రం అందిస్తున్న ఈ సహాయ సహకారాల గురించి మేము ప్రజలకు ఏవిధంగా చెప్పుకొని వారిలో కేంద్రం పట్ల అనుమానాలు, అపోహలు ఏవిధంగా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామో అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెదేపా నేతలు అందరూ కూడా అది తమ బాధ్యతగా భావించి ప్రజలకు చెప్పాలి. లేకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది,” అని చెప్పారు.

పురందేశ్వరి జవాబును బట్టి అర్ధమవుతున్నదేమిటంటే, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు. కనుక ఆ నిర్దిష్టంగా ఆ పేరుని ఉపగించకుండా, ప్రత్యేక హోదాకి ఏమాత్రం తక్కువ కాని విధంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. సహాయ సహకారాలు అందిస్తోంది. మున్ముందు కూడా అందిస్తుందని స్పష్టం అయ్యింది.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఆనాడు ప్రత్యేక హోదా కావాలని పురందేశ్వరి, తదితరులు జైరాం రమేష్ ని అడిగినప్పుడు ఆయన సాధ్యం కాదని చెప్పారు. అలాగే సోనియా, రాహుల్ గాంధిలు కూడా స్పందించలేదని పురందేశ్వరి చెపుతున్నారు. అంటే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే సంగతి వారికి అప్పుడే తెలుసని అర్ధమవుతోంది. కానీ ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెట్టేందుకే అప్పుడు నోటి మాటగా డా. మన్మోహన్ సింగ్ చేత పార్లమెంటులో హామీ ఇప్పించారు.

అప్పుడు సాధ్యం కాదని చెప్పి ఇవ్వడానికి ఇష్టపడని ఆ ముగ్గురే ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని మోడీ ప్రభుత్వాన్నితరచూ  ప్రశ్నిస్తుండటం మనం చూడవచ్చును. పురందేశ్వరికి తెలిసిన ఈ విషయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు తెలియదనుకోలేము. అయినా రఘువీరా రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక హోదా కోరుతూ కోటి సంతకాలు, మట్టి సత్యాగ్రహం, ఛలో డిల్లీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మనం గమనించవచ్చును. అంటే రాష్ట్ర విభజన సమయంలోనే కాదు నేటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారని స్పష్టం అవుతోంది. రాష్ట్ర విభజన చేసినందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరిచిపోలేని గుణపాఠం చెప్పినప్పటికీ వారి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని దీని వలన స్పష్టం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close