ఒక్కరోజులోనే మాటమార్చిన పూరి

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాపై దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక్కరోజులోనే మాట మార్చారు. తాను చిరంజీవికి కథను నేరేట్ చేస్తే ఫస్ట్ హాఫ్ నచ్చిందని ఆయన అన్నారని, సెకండ్ హాఫ్ మెరుగుపరచమని అన్నారని పూరి చెప్పారు. అయితే సెకండ్ హాఫ్‌ను తాను తయారు చేసేలోపుగానే ఆ స్టోరీ నచ్చలేదని చిరంజీవి మీడియాతో చెప్పారని, ఆ మాట తనతోనే చెబితే బాగుండేదనికూడా పూరి అన్నారు. పైగా, ఈ ప్రాజెక్ట్ కారణంగా తాను రెండుకోట్ల రూపాయల అడ్వాన్స్‌లు వెనకకు ఇచ్చేశానని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన పూరి, ఏమయిందో ఏమోగానీ ఒక్కరోజులోనే మాట మార్చేశారు. చిరంజీవితో ఎలాగైనా సినిమా చేస్తానని అన్నారు. 150వ సినిమా కాకపోతే 151వ సినిమా అయినా చేస్తానంటూ ఇవాళ ట్వీట్ చేశారు. చిరంజీవి 150వ సినిమా చేయటానికి అందరికంటే తనకే ఎక్కువ హక్కు ఉందని, ఎందుకంటే తాను ఆయన అభిమానినని పేర్కొన్నారు. తెరమీద చిరంజీవి ఎలా ఉండాలో ఆయనకన్నా, ఫ్యాన్స్‌కే తెలుసని అన్నారు. ఈ కథ కుదరకపోతే, మరో కథ తయారు చేస్తానని, అదీ నచ్చకపోతే ఆయనకు నచ్చేంతవరకు చేస్తానని పేర్కొన్నారు. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్నదే తన కోరిక అని అన్నారు.

ఈ ట్వీట్‌ల వ్యవహారం వెనక చరణ్ ఉన్నాడని తెలిసింది. పూరి మొన్న తన పుట్టినరోజున చిరు 150వ సినిమాపై కామెంట్ చేయగానే, చరణ్ బర్త్‌డే విషెస్ చెప్పటానికి పూరిదగ్గరకు వెళ్ళి ఆయనను శాంతింపజేశాడని సమాచారం. అందుకే పూరి ఇవాళ చిరుపై ప్రేమను రంగరిస్తూ ట్వీట్‌లు చేశాడని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close