పూరిని ఏడిపించిన ‘రొమాంటిక్‌’

కొడుకు హిట్ కొడితే చూడాల‌ని ఏ తండ్రికి ఉండ‌దు? పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఇందుకు అతీతుడు కాదు. పూరి చాలామంది హీరోల‌కు సూప‌ర్ హిట్లు ఇచ్చాడు. వాళ్ల కెరీర్‌ని మార్చేసే సినిమాలు అందించాడు. కానీ.. త‌మ్ముడు సాయి రామ్ శంక‌ర్ కి మాత్రం హిట్ ఇవ్వ‌లేక‌పోయాడు. అయితే… త‌న‌యుడు ఆకాష్‌పూరి విష‌యంలో ఎలాంటి పొర‌పాటూ చేయ‌ద‌ల‌చుకోలేదు. ఆకాష్ ని మాస్ హీరోగా ప‌రిచ‌యం చేయాల‌న్న ఆశ‌తోనే `మెహ‌బూబా` తీశాడు. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఈసారి `రొమాంటిక్‌`తో మాత్రం ఆకాష్‌కి హిట్ ఇచ్చేసేట్టే క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాకి పూరి ద‌ర్శ‌కుడు కాక‌పోయినా, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించి, నిర్మాణ బాధ్య‌త‌లూ స్వీక‌రించాడు. దాంతో ఇది పూరి సినిమాగానే చాలామ‌ణీ అవుతోంది.

ఈ సినిమాపై పూరి చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి మాట్లాడిన మాట‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఫైన‌ల్ అవుట్ పుట్ చూశాక పూరి మ‌రింత సంతృప్తిని వ్య‌క్తం చేశాడ‌ట‌. ఎడిట్ రూమ్ లో ఈ సినిమా చూశాక‌.. ఏడ్చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని `రొమాంటిక్‌` ద‌ర్శ‌కుడు అనిల్ పాడూరి తెలిపారు. ”ఎడిట్ రూమ్ లో ఈ సినిమా చూసి పూరిసార్ ఏడ్చేశారు. ‘అమ్మానాన్న త‌మిళ అమ్మాయి’తో ఈ సినిమాని పోల్చారు. `అమ్మా నాన్న సినిమాని నేను చాలా ఎమోష‌న‌ల్ గా తీశాను. ఈ సినిమాని కూడా నువ్వు అలానే తీశావ్‌’ అని మెచ్చుకున్నారు. పూరి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే” అని చెప్పుకొచ్చాడు అనిల్. ఈవారంలోనే `రొమాంటిక్‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశాఖనే రాజధానట – రాజ్యాంగం పట్టించుకోని ఏకైక సీఎం జగన్ !

విశాక ఏకైక రాజధాని అని పెట్టుబడిదారులకు సీఎం జగన్ చెబుతున్నారు. విశాఖలో నిర్వహించబోతున్న గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు రావాలంటూ దౌత్యవేత్తలను ఆహ్వానించేందుకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఓ గెట్...

‘రైట‌ర్‌’ గారు చాలా చీప్‌

సుహాస్ హీరోగా న‌టించిన 'క‌ల‌ర్ ఫొటో'కి మంచి పేరొచ్చింది. అయితే అది థియేట‌ర్లో రాలేదు. ఓటీటీకి ప‌రిమిత‌మైంది. తొలిసారి సుహాస్ త‌న అదృష్టాన్ని థియేట‌ర్ల‌లో ప‌రీక్షించుకోబోతున్నాడు. 'రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌' సినిమాతో. ఈ సినిమా...

మ‌రో హీరోని విల‌న్ చేసిన బోయ‌పాటి

బోయ‌పాటి స్ట్రాట‌జీలు కాస్త భిన్నంగా ఉంటాయి. అప్ప‌టి వ‌ర‌కూ లేని ఇమేజ్‌ని త‌న సినిమాతో.. తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు బోయ‌పాటి. లెజెండ్ లో బాల‌కృష్ణ‌, అఖండ‌లో శ్రీ‌కాంత్‌ల ఇమేజ్‌ల‌ను పూర్తిగా మార్చేశారాయ‌న‌. ఇప్పుడు...

ఈటలకు పార్టీ మారక తప్పని పరిస్థితి వస్తుందా ?

బీజేపీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు చిక్కులు వస్తున్నాయి. ఆయనపై సొంత బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీలో ఉండి ఆయన ఈ వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close