బాల‌య్య‌తో సినిమా.. పూరి ఏమ‌న్నాడంటే..??

పైసా వ‌సూల్ కోసం తొలిసారి బాల‌కృష్ణ‌తో క‌ల‌సి పనిచేశాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమా ఫ‌లితం ఎలాగున్నా – పూరి వ‌ర్కింగ్ స్టైల్ బాల‌య్య‌కు బాగా న‌చ్చింది. అందుకే మ‌రో సినిమా చేయ‌డానికి కూడా అప్ప‌ట్లోనే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర‌వాత పూరి – బాలయ్య మ‌ళ్లీ క‌ల‌సి ప‌నిచేస్తార‌ని వార్త‌లొచ్చాయి. బాల‌య్య‌కు పూరి ట‌చ్‌లోనే ఉన్నాడ‌ని, త్వ‌ర‌లోనే ఈ కాంబోలో సినిమామొద‌ల‌వుతుంద‌ని చెప్పుకున్నారు. అయితే ఆ అవ‌కాశాన్ని కె.ఎస్‌. ర‌వికుమార్ ప‌ట్టుకెళ్లిపోయాడు. పూరి కూడా `ఇస్మార్ట్ శంక‌ర్‌` షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ ప‌నులైపోయాయి. బాల‌య్య‌తో మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేయ‌డానికి పూరి కూడా ఉవ్వీళ్లూరుతున్నాడు. మ‌రి బాల‌య్య‌తో సినిమా ఎప్పుడు..?? ఇదే విష‌యాన్ని పూరిని అడిగితే –

“బాల‌తో మ‌రో సినిమా చేయాలి. ఆయ‌నకు త‌గిన క‌థ రాసుకోవాలి. అది ఎప్పుడు సిద్ఢ‌మైనా స‌రే.. ఆయ‌న ద‌గ్గ‌ర వాలిపోతాను. నా ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లున్నాయి. అయితే.. బాల‌య్య‌తో సినిమా అంటే మనం కొత్త‌గా ఏమైనా రాసుకోవాలి. ఆయ‌న అన్ని ర‌కాల క‌థ‌లూ చేసేశారు. ఏ క‌థ చేద్దామ‌న్నా… ఆ టైపు క‌థ‌లు నాలుగైదు ఆయ‌న ఖాతాలో ఉండే ఉంటాయి. అందుకే ఈసారి బాల‌య్య కోసం కొత్త‌గా ఓ క‌థ రాద్దామ‌నుకుంటున్నా. అది పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య‌కు వినిపిస్తా” అంటున్నాడు పూరి. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ ఈనెల 18న విడుద‌ల అవుతోంది. ఈ సినిమా హిట్ట‌యితే పూరికి బాల‌య్య నుంచి ఆఫ‌ర్ వ‌చ్చే ఛాన్సులు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com