పూరి కోసం స్పెష‌ల్ షో

లాక్ డౌన్ ఎత్తేసి, థియేట‌ర్లు తెర‌చుకుంటే… మొద‌టిగా విడుద‌ల‌య్యే సినిమాల్లో ‘నిశ్శబ్దం’ ఒక‌టి. అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషించిన సినిమా ఇది. మాధ‌వ‌న్ లాంటి స్టార్లు ఈ సినిమాకి వెన్నుద‌న్నుగా నిలిచారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాని ఓ టీ టీలో విడుద‌ల చేస్తార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. చిత్ర‌బృందం మాత్రం థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న నిశ్శ‌బ్దం ఇప్పుడు విడుద‌ల‌కు రెడీగా ఉంది.

ఈలోగా ‘నిశ్శ‌బ్దం’ చిత్రాన్ని పూరి జ‌గన్నాథ్ కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. హేమంత్‌.. పూరికి బాగా దోస్త్‌. పైగా అనుష్క కావ‌ల్సిన వ్య‌క్తి. అనుష్క‌ని ఇంట్ర‌డ్యూస్ చేసింది పూరి జ‌గ‌న్నాథే. అందుకే ఈ సినిమా చూడ్డానికి పూరి ఆస‌క్తి చూపించాడ‌ని, పూరికి ఈ సినిమా ప్ర‌త్యేకంగా చూపించార‌ని తెలుస్తోంది. సినిమా చూశాక పూరి త‌న‌దైన కొన్ని స‌ల‌హాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇక `నిశ్శ‌బ్దం` విడుద‌ల తేదీ ప్రక‌టించి, ప్ర‌మోష‌న్లు మొద‌లెట్ట‌డ‌మే బాకీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా – వీక్షించిన 50,000 మంది…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు...

అపెక్స్ కౌన్సిల్‌ భేటీకి మరోసారి ముహుర్తం..!

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం మరో ప్రయత్నం చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీని వచ్చే నెల ఆరో తేదీన ఏర్పాటు చేస్తూ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ మేరకు...

HOT NEWS

[X] Close
[X] Close