తేజ సినిమాలో ర‌కుల్‌..?

తేజ చేతిలో ప్ర‌స్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. గోపీచంద్ తో ఓ సినిమా, రానాతో మ‌రో సినిమా చేస్తున్నారు. వీటిలో ముందుగా గోపీచంద్ సినిమానే ప‌ట్టాలెక్కుతుంది. ఈ చిత్రానికి ‘అలివేలు వెంట‌క‌ర‌మ‌ణ‌’ అనే పేరు ఫిక్స్ చేశారు. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. అలివేలు పాత్ర కోసం అన్వేష‌ణ మొద‌లైంది. ఈ పాత్ర‌లో కాజ‌ల్ గానీ, అనుష్క గానీ క‌నిపిస్తార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

కాజ‌ల్ ఈ సినిమాలో న‌టించ‌డానికి ముందుకొచ్చినా, తేజ మ‌రో ఆప్ష‌న్ కోసం వెదుకుతున్నారు. అనుష్క ని క‌థానాయిక‌గా ఎంచుకోవ‌డం రూమ‌రే. తేజ దృష్టిలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. ఒక‌రు ర‌కుల్ ప్రీత్‌, మ‌రొక‌రు సాయి ప‌ల్ల‌వి. అయితే సాయి ప‌ల్ల‌వి డేట్లు ఇప్పుడు దొర‌క‌డం అంత ఈజీ కాదు. త‌న చేతిలో `విరాట ప‌ర్వం` ఉంది. అందుకే అన్ని విధాలా ర‌కుల్ అయితే బెట‌ర్ అని… తేజ భావిస్తున్నారు. ఇది వ‌ర‌కు గోపీచంద్ – ర‌కుల్ క‌లిసి ‘లౌక్యం’లో న‌టించారు. ఆ సినిమా హిట్ట‌య్యింది కూడా. సో.. సెంటిమెంట్ ప‌రంగానూ ర‌కుల్ బెస్ట్ ఆప్ష‌న్ అని తేజ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సాయి ప‌ల్ల‌వి కాల్షీట్లు అనూహ్యంగా దొరికేస్తే త‌ప్ప‌… క‌థానాయిక విష‌యంలో మార్పు లేక‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close