మ‌హేష్ క‌థ‌లో.. సోనూసూద్‌?

పూరి జ‌గ‌న్నాథ్ చాలా ఇష్టంగా రాసుకున్న క‌థ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. మ‌హేష్ బాబుతో ఈ సినిమా చేద్దామ‌నుకున్నాడు. ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. కానీ…. అనుకోకుండా మ‌హేష్ డ్రాప్ అయ్యాడు. అప్ప‌టి నుంచీ ఆ క‌థ అలానే ఉంది. ఎప్ప‌టికైనా స‌రే, ఆ సినిమాని మ‌హేష్ తో చేయాల‌న్న‌ది త‌న ఆశ‌. అయితే ఇప్పుడు ఆ ఆలోచ‌న మారింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ స్క్రిప్టుని తెర‌పై చూసుకోవాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. `కేజీఎఫ్‌` హీరో య‌శ్‌తో పూరి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అది `జ‌న‌గ‌ణ‌మ‌న‌` కాదు. మ‌రో కథ‌.

య‌శ్‌తో సినిమా అయ్యాక‌.. `జ‌న‌గ‌ణ‌మ‌న‌`ని మొద‌లెట్టే ఛాన్సుంది. అయితే ఈసారి సోనూసూద్ తో ఈ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. సోనూ ఇప్పుడు రియ‌ల్ హీరో. దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. త‌నైతే ఈ క‌థ‌కు బాగుంటుంద‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. పైగా సోనూ అంటే పూరికి చాలా ఇష్టం. పూరి త‌న సినిమాల్లో సోనూకి మంచి పాత్ర‌లు ఇచ్చాడు. ఇద్ద‌రి మ‌ధ్యా మంచి అనుబంధం ఉంది. అందుకే.. ఈ క‌థ‌ని సోనూతో సెట్ చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

తమ వర్గం మీద జగన్ కక్ష సాధింపు పై క్షత్రియ సంఘం ఆవేదన

అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించడం, కరోనా సమయంలో విపత్తు నిర్వహణ కంటే రాజకీయ కక్ష సాధింపు పై ప్రభుత్వం దృష్టి పెట్టడం సబబు...

HOT NEWS

[X] Close
[X] Close