లైగర్ ఫ్లాఫ్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ పై చాలా కథనాలు వచ్చాయి. ఆయనకి హీరో దొరకడం లేదని, జనగణమన ఆగిపొయిందని, ఆర్ధికంగా కూడా దివాళ తీశాడని, ఇక కొడుకు ఆకాష్ తో చిన్న సినిమా చేసుకోవాలని.. ఇలా చాలా వార్తలు నిపించాయి. అయితే ఇవన్నీ రూమర్స్ అనే అనుకోవాలి. కారణం.. పూరి ప్లానింగ్ ఇప్పుడు మామూలుగా లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలతో ఆయన టచ్ లోకి వెళ్ళాడు. రన్వీర్ సింగ్, విక్కీ కౌశల్ లాంటి హీరోలతో సినిమా చేసే ఆలోచనలో వున్నాడు పూరి. జనగణమన ఆగిపోలేదు. ఈ ఇద్దరి హీరోలో ఒకరితో ఈ సినిమా వుంటుందని తెలిసింది.
అలాగే పూరి ఆర్ధికంగా వీక్ అయ్యారనే వార్తల్లో కూడా నిజం లేదు. పూరి కోరుకునే పెట్టుబడి పెట్టె వాళ్ళు ఆయన దగ్గర వున్నారు. అలాగే ముంబైలో ఒక పెద్ద ఆఫీస్ తీశారు పూరి. దిని అద్దె నెలకు పది లక్షల వరకూ వుంటుంది. లైగర్ ఫ్లాఫ్ తర్వాత ఆఫీస్ ని తీసేశారని వినిపించింది. ఇందులో కూడా నిజం లేదు. ముంబై ఆఫీస్ వుంది. జనగణమన పనుల ఆ ఆఫీస్ నుండే మొదలుపెట్టారు. మొత్తానికి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తోనే ప్రేక్షకులని పలకరించబోతున్నారు పూరి.