‘పుష్ష’‌.. ఫైట్ రిహార్స‌ల్‌

టాలీవుడ్ లో షూటింగుల క‌ళ మొద‌లైంది. ఈనెల‌లోనే ఆచార్య‌, ఆర్‌.ఆర్‌.ఆర్ సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్నాయి. వ‌చ్చే నెల‌లో `పుష్ష‌` కూడా షూటింగ్‌కి శ్రీ‌కారం చుట్టుకుంటోంది. అయితే అందుకు సంబంధించిన స‌న్నాహాలు మాత్రం ఇప్పుడే మొద‌లైపోయాయి. కొత్త షెడ్యూల్‌ని ఓ పోరాట ఘ‌ట్టంతో ప్రారంభించ‌బోతున్నాడు సుకుమార్‌. అడ‌వుల్లో ఫైట్‌. కాబ‌ట్టి… ప్ర‌త్యేకంగా ఉండాల్సిందే. అందుకే ఇప్ప‌టి నుంచే రిహార్స‌ల్స్ కూడా మొద‌లెట్టేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో బ‌న్నీ ఈ ఫైటింగ్ రిహార్స‌ల్స్ మొద‌లు పెట్టారు. పీట‌ర్ హెయిన్స్ ఆధ్వ‌ర్యంలో ఈ పోరాట ఘ‌ట్టాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ‌లో గానీ, మారేడుమ‌ల్లి లో గానీ ఈ ఫైట్ ని తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది. సుకుమార్ మొద‌టి ఆప్ష‌న్‌మాత్రం కేర‌ళ‌నే. అక్క‌డి నుంచి అనుమ‌తులు వ‌స్తే.. షూటింగ్ మొద‌లెట్టేయొచ్చు. ఈ సినిమా కోసం బ‌న్నీ ప్ర‌త్యేక‌మైన లుక్ లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ లాక్ డౌన్ వేళ‌.. ఈ లుక్‌పైనే బ‌న్నీ శ్ర‌ద్ధ పెట్టాడు. క‌థానాయిక‌గా ర‌ష్మిక న‌టిస్తోంది. త‌న ఆహార్యం, మాట్లాడే తీరు కూడా విభిన్నంగా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోస‌మే ర‌ష్మిక చిత్తూరు మాండ‌లికం కూడా నేర్చుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close