తొలి అడుగు వ‌ర్మ‌దే!

అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు తెర‌చుకుంటున్నాయి. అయినా నిర్మాత‌ల‌లో ఉత్సాహం లేదు. ఎప్ప‌టిలా థియేట‌ర్లకు జ‌నం వ‌స్తారా, రారా? అనే భ‌యాలు వెంటాడుతున్నాయి. అక్టోబ‌రు 15న థియేట‌ర్లు తెర‌చుకున్నా, కొత్త సినిమాలేవీ రావ‌ని విశ్లేష‌కులు తేల్చేస్తున్నారు. అయితే…. వ‌ర్మ నుంచి తొలి అడుగు ప‌డ‌బోతోంది. అక్టోబ‌రు 15నే త‌న సినిమాని విడుద‌ల చేయ‌డానికి వ‌ర్మ రెడీ అయిపోయాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా సినిమాలు తీసేసి ప‌క్క‌న పెట్టుకున్నాడు వ‌ర్మ‌. అందులో `క‌రోనా వైర‌స్‌` ఒక‌టి. ఈ సినిమాకి అక్టోబ‌రు 15న విడుద‌ల చేస్తున్న‌ట్టు వ‌ర్మ ప్ర‌క‌టించాడు. లాక్ డౌన్ త‌ర‌వాత‌.. విడుద‌ల అవుతున్న తొలి సినిమా ఇదే. పైగా ఇదీ క‌రోనా నేప‌థ్యంలో సాగే సినిమానే. మొత్తానికి వ‌ర్మ నుంచి తొలి అడుగు ప‌డ‌బోతోంది. మిగిలిన వాళ్లు వ‌ర్మ‌ని అనుస‌రిస్తారా, అనుక‌రిస్తారా.. ఆగి ఆలోచిస్తారా అన్న‌దే తేలాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

HOT NEWS

[X] Close
[X] Close