రాథేమా- వ్యక్తిగత స్వేచ్ఛ – పదిప్రశ్నలు

తాను దేవతనని చెప్పుకుంటున్న రాథేమా గురించి మీడియాలో అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు మద్దతు పలికే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.వారిప్పటికే అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. వ్యక్తిగత స్వేఛ్చ, మహిళాస్వేచ్ఛ అన్నవాటి చూట్టూ ఈ ప్రశ్నలు తిరుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టివీ షోల ద్వారా పాపులరైన నటి, రాజకీయనాయకురాలు రాఖీసావంత్ కూడా రాథేమాకు పూర్తి మద్దతు ప్రకటించింది. రాథేమా తన విదేశీ పర్యటనలో మినీస్కర్ట్ (పొట్టి గౌను) ధరించి అశ్లీలంగా ఫోజులిస్తూ దిగిన ఫోటోలు, మరో పక్క గాడ్ ఉమెన్ గా దిగిన ఫోటులు సోషల్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ విస్తృతంగా కనిపించడంతో ఆమె గురించిన చర్చ తారాస్థాయికి చేరుకుంది. జాతీయ న్యూస్ ఛానెళ్లు రాథేమా వివాదంపై చర్చలు నిర్వహిస్తున్నాయి. రాథేమా వరకట్నం కేసులో చిక్కుకోవడం, ఆమె పేరు ఎఫ్ఐఆర్ లో ఉండటం వంటి అంశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. రాథేమా మీడియాకు అందుబాటులో లేకపోవడంపై కూడా అనేక సందేహాలు చోటుచేసుకుంటున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలు, ఆక్షేపణలపై రాథేమా ఎలా స్పందిస్తున్నారన్నది ప్రస్తుతానికి తెలియకపోయినా, ఆమెను ఆరాధించేవాళ్లు, ఆమెకు మద్దతు తెలుపుతున్నవారు సభ్యసమాజాన్ని ప్రశ్నిస్తున్నారు.

రాథేమా సాధారణంగా ఎరుపు రంగు చీరకట్టుకుని, నుదుట పెద్ద బొట్టుపెట్టుకుని అమ్మవారి అవతారమన్నట్టుగా కనిపిస్తుంటారు. ఆమెను దేవతగా అనేకమంది భావిస్తుంటారు. ఆమె పొట్టిదుస్తులు వేసుకున్న ఫోటోలు బహిర్గతం కావడంతో వివాదం చెలరేగుతున్న ప్రస్తుత సమయంలోకూడా ఆమెకు కొంతమంది అండగా నిలవడం విశేషం.

రాఖీసావంత్ , సినీదర్శకుడు ప్రహ్లాద్ కక్కర్, సినీనిర్మాత సుభాష్ గై, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ సహా అనేకమంది ప్రముఖులు రాథేమాకు మద్దతు పల్కుతున్నారు. రాథేమా చేసినతప్పేమిటన్నది వారి వాదన. వారు సంధిస్తున్న ప్రశ్నలను క్రోడీకరిస్తే…

1. దేవతగా చెప్పుకునే వ్యక్తి ఇలాంటి దుస్తులే ధరించాలన్న రూల్ ఎక్కడైనా ఉందా ? ఆమె తన స్వేచ్ఛను చాటుకుంటున్నదని ఎందుకు భావించరు ?

2. మతప్రచారకులు లేదా దైవాంశసంభూతులైన వారు ఎప్పుడూ, రోజంతా కాషాయం బట్టలే కట్టుకోవాలా ? శిరోజాలు విరబూసుకునే ఉండాలా? మామూలు దుస్తులు వారు కాసేపన్నా ధరించకూడదా?

3. భారత రాజ్యాంగంలో దైవాంశసంభూతులు ఇలాంటి దుస్తులే ధరించాలని ఉన్నదా ? లేదా ఏ మతపరమైన గ్రంథంలోనైనా డ్రెస్ కోడ్ ఉన్నదా ?

4. రాథేమా వేసుకున్న దుస్తులపై విపరీత ప్రచారం చేస్తున్నవారికి ఉన్న హక్కేమిటీ ? వ్యక్తిస్వేచ్ఛకు భంగం కలిగించేరీతిలో మీడియా ఎందుకు ప్రవర్తిస్తోంది ? ఒక మహిళ వేసుకున్న దుస్తులపై ఇంతగా చర్చజరగడం స్త్రీలను అవమానపరచినట్టుకాదా?

5. రాథేమాలో ఇంతవరకు ఒకవిధమైన శక్తి (డివోషనల్ ఎనర్జీ) మాత్రమే చూసిన సమాజం, మరోవైపు శక్తి (హ్యూమన్ ఎనర్జీ) చూసి జీర్ణించుకోలేక ఆమె చుట్టూ వివాదాలు సృష్టిస్తున్నది. రాథేమాను వివాదాల్లోకి లాగడం ఆమెలోని శక్తిని అవమానించినట్టు కాదా…?

6. మనసు నిర్మలమైనప్పుడు దాని గురించి ఆలోచించకుండా పొట్టి దుస్తులు వేసుకున్నారన్న ఆరోపణలు చేయడం సరైనదేనా?

7. రాథేమా తనదగ్గరకు వచ్చిన వారెవరైనా, ఎంత వయసున్నవారినైనా తన తల్లిదండ్రులుగానే భావిస్తారు. మానవత్వానికీ, ప్రేమకు నిర్వచనంచెప్పే ఈ తత్వం తప్పని ఎవరైనా అనగలరా?

8. రాథేమా చిన్నపిల్లల మనస్తత్వం కలిగిఉంటారు. ఆమె కోరుకున్న దుస్తులు వేసుకుంటారు. తనకు ఇష్టమైన ప్రదేశాలకు (యుఎస్ లాంటివన్నమాట) వెళతారు. అందులో తప్పేముంది?

9. రాథేమాను కొలవడం అంథవిశ్వాసమనుకుంటే, మీడియాలో చెప్పేవన్నీ శుద్ధమైనవే అనుకోవాలా ? మీడియా కథనాలను పూర్తిగా నమ్మవచ్చా ? మీడియాకున్న పవిత్రత ఎంత?

10. గాడ్ ఉమెన్ రాథేమా చెప్పిన సంగతులు, ఆచరించమని చెప్పిన అంశాలు మంచివైనప్పుడు ఆమెతో సత్ సంఘం తప్పెలా అవుతుంది ?

ఇలాంటి అభిప్రాయాలను రాథేమా దగ్గరకు వెళ్ళివచ్చినవారు, ఆమెకు మద్దతు ఇస్తున్నవారు వ్యక్తం చేస్తుంటే, మరో పక్క బాలీవుడ్ నటుడు రిషీకపూర్ ఆమె ఫోటోలు ట్వీట్ చేస్తూ – ఇలాంటి యాక్టర్స్ అమాయకులైన ప్రజలను మోసంచేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలంటూ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. కాగా, వ్యక్తిగత స్వేఛ్చ ఉన్నప్పటికీ, మతం, గాడ్ ఉమెన్ పేరిట ఆమె మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఆమె సమాదానం కచ్చితంగా చెప్పాలని అనేకమంది కోరుకుంటున్నారు.

ఏమైనప్పటికీ, రాథేమా ఎలా స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈలోగా మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close