” జగన్ బెయిల్‌ రద్దు” తీర్పు పై ఉత్కంఠ.. రఘురామ కొత్త పిటిషన్ !

జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం వెల్లడి కావాల్సిన తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని విచారణ బెంచ్‌ను మార్చాలని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంత వరకూ తీర్పును వాయిదా వేయాలన్నారు. దీనికి కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థల్లో తీర్పు గురించి ముందుగానే ప్రచారం జరగడాన్ని చూపించారు. ఇలా ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థలు తీర్పును ప్రభావితం చేస్తున్నాయని అందుకే విచారణను ప్రత్యేక బెంచ్‌కు మార్చాలని కోరారు.

లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే తీర్పును బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాతే సీబీఐ కోర్టు తీర్పులను వెల్లడించే అవకాశం ఉంది.అప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగనుంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. ఆగస్టు 25వ తేదీన తీర్పు చెబుతామని సీబీఐ కోర్టు చెప్పింది.

అయితే ఆ రోజున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలతో సమయం ముగిసిపోవడం, తీర్పు కాపీ ఇంకా రెడీకాకపోవడంతో రెండు పిటిషన్లపై సెప్టెంబర్ 15వ తేదీన తీర్పు చెబుతామని న్యాయమూర్తి ప్రకటించారు. అయితే ఆగస్టు 25వ తేదీన తీర్పు రాక ముందే జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాలో ” పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి ” అని తీర్పును ప్రకటించారు. ఈ కారణంగా రఘురామకృష్ణరాజు తీర్పును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

HOT NEWS

[X] Close
[X] Close