అచ్చెన్నను క్షమించేసిన ప్రివిలేజ్ కమిటీ ! ?

అచ్చెన్నాయుడును అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా వేటు వేస్తారన్న ప్రచారం తేలిపోయింది. ప్రివిలేజ్ కమిటీ ముందు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. స్పీకర్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఒక వేళ తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు పేరుతో వచ్చిన ప్రెస్ నో‌ట్ విషయంలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను దాన్ని రెడీ చేసి ఆఫీసులో ఉంచానని తనకు తెలియకుండానే బయటకు వచ్చిందని వివరణ ఇచ్చారు.

ఈ అంశంపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారని తెలిపారు. తాను ప్రెస్‌నోట్ ఆఫీసులో పెడితే తన సంతకం లేకుండానే రిలీజ్ అయిందని చెప్పారన్నారు. పొరపాటు జరిగిందని అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారని ఈ వివాదాన్ని తాను పొడిగించదల్చుకోలేదని.. తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్న చెప్పినందున వివరణను మిగిలిన సభ్యులకూ పంపుతామన్నారు.

సభ్యుల అభిప్రాయాల మేరకు అచ్చెన్నపై విషయాన్ని ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వ్యక్తిగతంగా హాజరు కావడానికి గతంలో అచ్చెన్న నిరాకరించారు. అయితే ఈ సారి మాత్రం హాజరై వివాదానికి ముగింపునివ్వాలనుకోవడంతో సాఫీగాసమావేశం జరిగిపోయింది. సాధారణంగా అసెంబ్లీలో ఎలాంటి వివాదాలు వచ్చినా క్షమాపణ లేదా విచారం వ్యక్తం చేయడంతో ముగిసిపోతాయి. అచ్చెన్న వివాదం కూడా అలాగే ముగిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close